Jeevan Reddy: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరో కేసు TG: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. చైతన్య రిసార్ట్స్ భూ వివాదంలో జీవన్‌రెడ్డిపై చీటింగ్, దోపిడీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మోకిలా పీఎస్‌లో కేసు నమోదు అయింది. By V.J Reddy 28 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS Ex MLA Jeevan Reddy: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. చైతన్య రిసార్ట్స్ (Chaitanya Resorts) భూ వివాదంలో జీవన్‌రెడ్డిపై చీటింగ్, దోపిడీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. సామ దామోదర్ రెడ్డి (Sama Damodar Reddy) అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మోకిలా పీఎస్‌లో కేసు నమోదు అయింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగటూరులో పలు సర్వే నంబర్లలో తమ భూమిని ఆక్రమించారని ఆరోపణలు జీవన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఫ్లాట్లు వేసి విక్రయించారని అభియోగాలు. 20 ఎకరాలు కబ్జా.. ఇటీవల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై కేసు నమోదు అయింది. జీవన్ రెడ్డి తో పాటు అతని కుటుంబ సభ్యుల పై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్లపల్లి లో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. సర్వే నెంబర్ 32, 35, 36, 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాడు దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. Also Read: ఏసీబీ అధికారుల దూకుడు.. లారీ డ్రైవర్లు వేషంలో అవితిని అధికారులకు చుక్కలు 2023లో ఫంక్షన్ హాల్ లో కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ ను జీవన్ రెడ్డి పెట్టాడు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలతీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డి పై దాడికి దిగారు పంజాబీ గ్యాంగ్. మరణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రాంతులకు జీవన్ రెడ్డి అనుచరులు, పంజాబీ గ్యాంగ్ గురి చేశారు. ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు దామోదర్ రెడ్డి. జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 447, 427, 341, 386, 420, 506 r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. #former-brs-mla-jeevan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి