BIG BREAKING: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

TG: బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. దీంతో శాసనసభలో బీఆర్ఎస్ బలం 29కి పడిపోయింది.

New Update
BIG BREAKING: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

BRS PARTY: బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించింది.

అయితే.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ బలం 38కి పడిపోయింది. ఇప్పటి వరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో  చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 29కి తగ్గింది. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.

ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు సైతం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు