MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవితపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. జూన్ 3న అనుబంధ చార్జిషీట్ లో ఉన్న నిందితులందరు కోర్టుకు రావాలని సమన్లు జారీ చేసింది. By V.J Reddy 29 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవితపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. జూన్ 3న అనుబంధ చార్జిషీట్ లో ఉన్న నిందితులందరు కోర్టుకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ నెల 3న దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ (ED) అరెస్ట్ చేసింది. అనంతరం సీబీఐ సైతం ఇదే కేసులో ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పలు మార్లు బెయిల్ పిటిషన్ వేయగా అది వాయిదా పడుకుంటూ వస్తోంది. కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు పలు మార్లు విచారణ జరిపి ఆమె కస్టడీని పొడిగిస్తూ వచ్చింది. ఈ కేసులో కాస్త ఉపశమనం పొందేందుకు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇదిలా ఉంటే బెయిల్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరో ఛార్జిషీట్ ను దాఖలు చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. Delhi's Rouse Avenue Court takes cognizance of Enforcement Directorate's supplementary prosecution complaint (chargesheet) filed against BRS leader K Kavitha and others filed in Delhi excise policy money laundering case. — ANI (@ANI) May 29, 2024 #mlc-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి