AP : అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీస్తూ..!

సత్యసాయి జిల్లా వీరప్పగారి పల్లిలో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని మనస్థాపం చెంది సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

New Update
AP : అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీస్తూ..!

Anantapur : ఉద్యోగం నుంచి తొలగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని అంగన్వాడీ టీచర్ (Anganwadi Teacher) మనస్థాపం చెందింది. సెల్ఫీ వీడియో (Selfie Video) తీస్తూ ఆత్మహత్యాయత్నానికి (Suicide) యత్నించింది. శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) వీరప్పగారి పల్లికి చెందిన అంగనవాడి టీచర్ నాగమణి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు 108 సాయంతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకొని ఆమె సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యతిరేకవర్గం వారు ఆమెను అంగనవాడి టీచర్ పోస్టు తొలగించడానికి వేధింపులకు గురి చేస్తున్నారని.. తనపై లేని పోని ఆరోపణలు చేస్తూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు ఆమె వీడియోలో పేర్కొన్నారు.

ఇటీవల గ్రామస్తులు కొందరు నాగమనెమ్మ పనితీరు బాగోలేదని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ పిడి నాగమల్లేశ్వరి ఐదురోజుల క్రితం వీరప్పగారిపల్లిలో అంగన్వాడి సెంటర్ ను పరిశీలించారు. ఈ క్రమంలోనే రాజకీయ కుట్రలో భాగంగా తనను తొలగించేందుకే ఇలా చేస్తున్నారని మనస్థాపానికి గురైన అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు బంధువులు చెబుతున్నారు.

Also Read : కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!



Advertisment
Advertisment
తాజా కథనాలు