YS Jagan: స్వార్థంతోనే.. షర్మిల లేఖపై జగన్ సంచలన రియాక్షన్! నిన్న సోషల్ మీడియాలో టీడీపీ విడుదల చేసిన లేఖలపై సీఎం జగన్ స్పందించారు. మీ ఇళ్లల్లో ఇలాంటి కుటుంబ గొడవలు లేవా? అని ప్రశ్నించారు. ప్రతీ ఇంట్లో ఉండే విషయాలను స్వార్థం కోసం పెద్దవి చేసి చూపించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. By Nikhil 24 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి షర్మిలతో విభేదాలు.. నిన్న సోషల్ మీడియాలో టీడీపీ విడుదల చేసిన లేఖలపై సీఎం జగన్ స్పందించారు. మీ ఇళ్లల్లో ఇలాంటి కుటుంబ గొడవలు లేవా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ప్రతీ ఇంట్లో ఉన్న విషయాలను స్వార్థం కోసం నిజాలు లేకపోయినా పెద్దవి చేసి చూపించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఇకనైనా ప్రజల సమస్యలపై ధ్యాస పెట్టాలని సూచించారు. ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు! మీ ఇళ్లల్లో ఇలాంటి కుటుంబ గొడవలు లేవా @ncbn ? ప్రతి ఇంట్లో ఉన్న విషయాల్ని మీ స్వార్థం కోసం నిజాలు లేకపోయినా పెద్దవి చేసి చూపించడం ఇకనైనా మానుకోండి ప్రజల సమస్యలపై ధ్యాస పెట్టండి -@ysjagan గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు#SadistChandraBabu pic.twitter.com/dYwEXz9inF — YSR Congress Party (@YSRCParty) October 24, 2024 ఎన్నికల హామీల అమలులో విజయం.. చంద్రబాబు సర్కార్ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు జగన్. ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఫైర్ అయ్యారు. తన అమ్మ, చెల్లెలు ఫొటోలతో రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. డయేరియా కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఇది కూడా చదవండి: YS Sharmila: షర్మిల సంచలన నిర్ణయం! విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితుల్ని పరామర్శించి.. మృతుల కుటంబాలకి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన @ysjagan గారు.#YSJaganCares#IdhiMunchePrabhutvam#APisNotinSafeHands#SadistChandraBabu#100DaysOfCBNSadistRule pic.twitter.com/sCBFcpdSOO — YSR Congress Party (@YSRCParty) October 24, 2024 ఫ్యామిలీతో రాజకీయం.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను గుర్లకు వస్తున్నానని తెలిసి రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ ఫ్యామిలీ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే తిరుపతి లడ్డూ అంశం తెరపైకి తెచ్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు అమ్మ, చెల్లెలు ఫొటోలతో పాలిటిక్స్ స్టార్ట్ చేశారని ధ్వజమెత్తారు. #ys-jagan #tdp #sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి