నేడు సొంత జిల్లాలో జగన్ పర్యటన

AP: ఈరోజు నుంచి రెండు రోజులు కడప జిల్లాలో పర్యటించనున్నారు జగన్. జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. జిల్లాలోని పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన బాబాయ్ మనోహర్ రెడ్డి అత్త గారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

New Update
jagan..

YS Jagan: మాజీ సీఎం జగన్ తన సొంత జిల్లాలో పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి జిల్లాలో రెండు రోజుల పర్యటించనున్నారు. ప్రస్తుతం బెంగుళూరులో జగన్... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఇడుపులపాయ లో జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం పులివెందుల లోని నివాసానికి చేరుకుంటారు. ఇటీవల మృతి చెందిన బాబాయ్ మనోహర్ రెడ్డి అత్త గారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే పోలీసులు బందోబస్తీ ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చదవండి: బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు!

ఇటీవల చంద్రబాబుపై...

ఇది కూడా చదవండి: ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్

ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై సీఎం చంద్రబాబును విమర్శిస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో.. "చంద్రబాబుగారూ మీరు వైయస్సార్‌సీపీమీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్రప్రజలమీద కక్షసాధిస్తున్నారు. ఇది అన్యాయంకాదా? వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనంకాదా? దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకంచేసిన మాట వాస్తవం కాదా?..

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు!

 “దిశ’’ యాప్‌లో SOS బటన్‌ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్‌ కంట్రోల్‌ రూంకు, అక్కడనుంచి దగ్గర్లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్‌చేస్తారు. వారు ఫోన్‌ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లోచెప్పినా  ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? “దిశ’’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబుగారూ? 1.56కోట్ల మంది డౌన్లోడ్‌ చేసుకుని భరోసా పొందుతున్న “దిశ’’పై రాజకీయ కక్ష ఎందుకు? " అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో 6లక్షల రేషన్ కార్డులు రద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు