Jagan: తిరుమల లడ్డూపై జగన్ సీరియస్.. 3గంటలకు ప్రెస్ మీట్!

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వైసీపీపై కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన కౌంటర్ ఇవ్వనున్నారు.

author-image
By V.J Reddy
New Update
JAGAN

YCP Chief Jagan: ఏపీలో తిరుమల లడ్డూపై పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై మాజీ సీఎం మాట్లాడనున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందించనున్నారు. గుజరాత్‌కు చెందిన NDDB నివేదికపై తొలిసారి జగన్ మాట్లాడనున్నారు. ఇప్పటికే కూటమి సర్కార్‌ ఆరోపణలకు వైసీపీ నేతలు భూమన, వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్‌, వైసీపీని దెబ్బ తీసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. 

హైకోర్టుకు వైసీపీ..

తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు లంచ్‌ మోషన్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను వచ్చే బుధవారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.

తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి వాస్తవాలు బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డూపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సర్కార్ చెప్పింది. దేవుడిపై తప్పుడు ప్రచారం ఏంటని వైసీపీ మండిపడుతోంది. కాగా తాజాగా వైసీపీ కోర్టును ఆశ్రయించడంతో దీనిపై ధర్మసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో... 

ఇటీవల తిరుపతి (Tirupati) లడ్డూలో జంతు కళేబరం ఆయిల్ కలిపారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు. బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ వాడారని అన్నారు. ఈ విషయం తెలియగానే తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. అయితే ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నామని, ప్రజలకు స్వచ్ఛమైన భోజనం, ప్రసాదం అందించడమే తమ లక్ష్యమన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు