చంద్రబాబు గారు అంటూ జగన్ సంచలన పోస్ట్!

AP: సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శల దాడికి దిగారు. పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఎందుకు ప్రశ్నించడం లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్ర భవిష్యత్‌ను, ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెడతారని మరోసారి చంద్రబాబు నిరూపించారని అన్నారు.

New Update
ys jagan

Jagan: సీఎం చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు వైసీపీ చీఫ్ జగన్. పోలవరం అంశంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై చంద్రబాబును నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా ఎందుకు నోరుమెదపడం లేదు అని ప్రశ్నించారు. ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లయితే.. 41.15 మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారని అడిగారు. దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారని చురకలు అంటించారు. కేవలం డబ్బు కోసమే కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును మీ చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్‌ను, ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెడతారని మరోసారి నిరూపించారని ధ్వజమెత్తారు.

చంద్రబాబుగారూ అంటూ...

జగన్ తన అధికార ట్విట్టర్ ఖాతాలో.. "చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదు? చంద్రబాబుగారూ… ఎప్పుడు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును తాకట్టుపెడతారని, మీ స్వార్థరాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారుకదా? 

2. పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే, 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితంచేస్తున్నారు? తద్వారా  194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని తెలిసికూడా మీరు ఎందుకు అభ్యంతరం చెప్పడంలేదు? ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదలచేయలేని దుస్థితి నెలకొంటుంది. గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరిగా విద్యుత్‌ను ఉత్పత్తిచేయలేం. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేం. అన్నికంటే సుజలస్రవంతి ప్రాజెక్టుపై ఉన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుంది. మీ మద్దతుమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న వాస్తవ పరిస్థితుల మధ్య రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మీరు ఎందుకు చేతులెత్తేస్తున్నారు? ఎందుకు బేలతనం చూపుతున్నారు? దీనివెనుక మీ స్వార్థం ఏంటి చంద్రబాబుగారూ? 

3. పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పుడైనా, ఇప్పుడైనా చంద్రబాబుగారు… మీరు చేసిన, చేస్తున్న దుర్మార్గాలకు అంతులేకుండా పోతోంది. మొదటనుంచీ మీరు స్వప్రయోజనాలే చూసుకున్నారు. మీ బంధువులకు, మీ పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడంకోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును మీ చేతిలోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ డ్రామాతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టి పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని లూటీచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం మాదిరి డబ్బులు గుంజుకునే యంత్రంలా మారిందని సాక్షాత్తూ ఆనాడు ప్రధానమంత్రి ప్రజల సాక్షిగా అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను. నాడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బకొట్టిన మీరు మళ్లీ రాష్ట్రానిఇక జీవనాడి, పోలవరం విషయంలో అంతే నష్టం చేస్తున్నారు. " అని ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు