/rtv/media/media_files/2026/05/04/pawan-vijay-2026-05-04-16-41-52.jpg)
ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేడు విడుదల అవుతున్న ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. పాలన నచ్చితే ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారని.. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని అన్నారు.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును బలంగా కోరుకున్నట్లు స్పష్టం అయ్యిందన్నారు. అసోం, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకున్న బీజేపీ.. పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకుందన్నారు. ఆ పార్టీ అగ్రనాయకత్వం అకుంఠిత దీక్ష సర్వదా శ్లాఘనీయం అని ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్ వాసుల నమ్మకాన్ని పొందేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత కొన్ని ఏళ్లుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చిందన్నారు.
Follow Us