జగన్ కు షర్మిల రాసిన సంచలన లేఖను బయటపెట్టిన టీడీపీ!

టీడీపీ సంచలన పోస్ట్ చేసింది. జగన్ కు షర్మిల రాసిన లేఖలను బయటపెట్టింది. ఆస్తిలో తన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కు సమాన వాటా ఉంటుందని తండ్రి రాజశేఖర్ రెడ్డి గతంలో చెప్పిన మాటకు ఒప్పుకున్న జగన్.. ఇప్పుడు మోసం చేశాడని ఆ లేటర్లో షర్మిల ఆరోపించింది.

author-image
By Nikhil
New Update
YS Jagan Sharmila

టీడీపీ సంచలన పోస్ట్ చేసింది. జగన్ కు షర్మిల రాసిన లేఖలను బయటపెట్టింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సంచలన విషయాన్ని బయటపెడతామని ఈ రోజు పోస్ట్ చేసిన టీడీపీ.. కానీ చెప్పిన సమయానికి కన్నా ముందే బయటపెట్టింది. ''మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా  సంపాధించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కు సమానంగా పంచాలని ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకు అంగీకరిస్తున్నాని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు. భారతీ సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవితకాలంలో నాన్న సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ సమానంగా పంచుకోవాలని ఆనాడే నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా.. ''  అంటూ ఈ ఏడాది సెప్టెంబర్ 12న షర్మిల జగన్ కు రాసిన లేఖను టీడీపీ తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ లేఖపై వైఎస్ విజయమ్మ కూడా సంతకం చేసినట్లు కనిపిస్తోంది. 

Also Read: వైసీపీ ఫ్యామిలీలో ముదిరిన వివాదం.. షర్మిల, విజయమ్మపై జగన్‌ పిటీషన్

Also Read: ఏపీలో మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. రూ.99కే క్వార్టర్ అమ్మకాలు షురూ!

Also Read: APPSC చైర్మన్ ను నియమించిన గవర్నర్.. ఆ ఐపీఎస్ అధికారికి ఛాన్స్!

జగన్ ఓ సైకో.. : టీడీపీ

జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఒక వింత సైకో జగన్ అని ఈ సందర్భంగా టీడీపీ జగన్ పై సంచలన కామెంట్స్ చేసింది. ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా, జగన్ రెడ్డి అనే సైకో వేధించాడని ఈ పోస్ట్ లో ఆరోపించింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటని ఈ సైకో ఎలా తప్పాడో చూడండి అంటూ ధ్వజమెత్తింది. ఇలాంటి సైకోలు రాజకీయాల్లో, సమాజంలో ఉంటే ఎంత ప్రమాదమో చెప్పడానికే ఈ లేఖని ప్రజల్లో పెడుతున్నామని తెలిపింది.

Also Read: ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి గిఫ్ట్.. కేబినెట్ కీలక నిర్ణయాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు