/rtv/media/media_files/2025/04/01/od7uhcrvFVkgZswpSCVt.jpg)
kodali-nani mumbai
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్యాస్ట్రిక్ సమస్యతో వారం రోజుల కిందట గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయనను సోమవారం డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానికి అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకు గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం సూచించారు డాక్టర్లు. అయితే సర్జరీ చేసేందుకు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి సహకరించదని ఏఐజీ వైద్యులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీంతో కొడాలి నానిని సోమవారం మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలించారు.
నిలకడగానే మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం..
— Nagarjuna (@pusapatinag) April 1, 2025
నానికి ముంబైలో కొనసాగుతున్న వైద్య చికిత్సలు, పరీక్షలు..
అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, అనుచరులు ఆందోళన చెందవద్దని తెలిపిన కుటుంబ సభ్యులు..
క్లిష్టతరమైన గుండె సమస్య తలెత్తడంతో నానికి నిపుణుడైన రమాకాంత్ పాండ చికిత్స.. pic.twitter.com/rAxOLllfao
Also Read: ''నెక్ట్స్ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్ చేసి బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్
Also Read: Betting App: బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశం
ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో
ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో ఆయనకు డాక్టర్ రమాకాంత్ పాండా బైపాస్ సర్జరీ చేయనున్నారని తెలుస్తోంది. డాక్టర్ పాండాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. గతంలో మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్ , లాలూ ప్రసాద్ యాదవ్, కొనకళ్ల నారాయణ , రఘురామకృష్ణంరాజు లకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. రేపు లేదా ఎల్లుండి కొడాలి నానికి ఆయన బైపాస్ సర్జరీ చేయనున్నారు. ఇక కొడాలి నానికి ఆరోగ్యం గురించి పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కొడాలి నాని విశ్రాంతి తీసుకుంటున్నారు.
Also Read: ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్
Also Read: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..!