Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రెండు సార్లు మద్యం బాటిళ్లు కొని అక్కడ మిస్సింగ్ !

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. విజయవాడలో ప్రవీణ్ నాలుగు గంటలపాటు ఎక్కడున్నారనే దానిపై పోలీసులు టెక్నికల్ గా ఆధారాలు సేకరించారు. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం రూ.650 పెట్టి కోదాడలో లిక్కర్ బాటిల్ కొన్నాడు.

New Update
paster-praveen death cctv

paster-praveen death cctv

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. విజయవాడలో ప్రవీణ్ నాలుగు గంటలపాటు ఎక్కడున్నారనేదానిపై పోలీసులు టెక్నికల్ గా ఆధారాలు సేకరించారు. మీడియా కథనాల ప్రకారం... రాజమండ్రి చేరుకోవడానికి ముందు పాస్టర్ ప్రవీణ్‌ విజయవాడలో ఆగినట్టు ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్‌ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.  

మార్చి 24వ తేదీ  ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తన బైక్ పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. అదే రోజు మధ్యాహ్నం రూ.650 పెట్టి కోదాడలో లిక్కర్ బాటిల్ కొన్నాడు.  ఎన్టీఆర్‌ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చేముందు మద్యం సేవించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  అయితే కంచికచర్ల-పరిటాల మధ్య బైక్  అదుపుతప్పి పడిపోవడంతో బైక్ హెడ్‌లైట్‌ పగిలిపోయింది. దీంతో సేఫ్టీ రాడ్స్‌ వంగిపోగా..  ప్రవీణ్‌ చేతులకు గాయాలయ్యాయి. అక్కడినుంచి గొల్లపూడికి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోలు పోయించుకున్నారు పాస్టర్ ప్రవీణ్. అప్పటికే ప్రవీణ్‌ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంక్‌లోని ఉద్యోగులు పోలీసులకు వెల్లడించారు.  అక్కడా ఎనిమిది లీటర్ల పెట్రోల్ పోయించుకన్నాడని తెలిపారు.  అప్పటికే ప్రవీణ్‌ చేతులపై గాయాలు కనిపించాయని, బైక్ హెడ్‌లైడ్‌ ఊడిపోయి ఉందని పోలీసులకు వెల్లడించారు. ఆ తరువాత విజయవాడలోని దుర్గగుడి ఫ్లై ఓవర్‌, రాజీవ్‌గాంధీ పార్కు, నెహ్రూ బస్‌స్టేషన్‌ మీదుగా బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ ఎక్కి మహానాడు జంక్షన్‌కు చేరుకున్నారు ప్రవీణ్ . ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మహానాడు జంక్షన్‌కు చేరుకున్నాక  ప్రవీణ్ కాసేపు మాయం అయ్యారు. మహానాడు కూడలి- రామవరప్పాడు రింగ్‌కు మధ్యలో ఏదో జరిగిందని పోలీసులు అనుమానించారు. వోక్స్‌ వ్యాగన్‌ షోరూమ్‌కు ఎదురుగా నేషనల్ హైవేపై ఆయన బుల్లెట్‌పై నుంచి పడిపోయారు. అక్కడే ఉన్న ఆటోడ్రైవర్లు రింగ్‌లో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుబ్బారావుకు విషయం చెప్పారు.  వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్‌ను పైకి లేపి పక్కన ఉన్న రెయిలింగ్‌ వద్ద కూర్చోబెట్టారు. మెల్లిగా ఆయన్ను  ట్రాఫిక్‌ బూత్‌ దగ్గరకు తీసుకువచ్చి.. ముఖం కడుక్కోవడానికి ప్రవీణ్ కు ట్రాఫిక్‌ ఎస్‌ఐ నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత బూత్‌ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8.20 గంటల వరకు పాస్టర్‌ ప్రవీణ్‌ నిద్రపోయారు. నిద్రలేచాకమద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఎస్‌ఐ ఆయనకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తర్వాత ఇన్నోటెల్‌ హోటల్‌ పక్కన ఉన్న టీస్టాల్‌ వద్దకు తీసుకెళ్లి టీ తాగించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్‌ బుల్లెట్‌పై ఏలూరు వైపుగా బయల్దేరారు. టోల్‌గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక మళ్లీ అక్కడ టానిక్‌ వైన్స్‌లో రూ.350 పెట్టి మద్యం కొన్నారు ప్రవీణ్. .

సీసీ కెమెరాలు ప్రకారం జరిగిన సమయాలు

మార్చి 24వ తేదీ సాయంత్రం 4.45 గంటలకు గొల్లపూడిలో పెట్రోలు బంక్‌కు చేరుకుని ప్రవీణ్‌  పెట్రోల్ పోసుకున్నారు.  
5.13 గంటల సమయంలో మహానాడు కూడలిలో నేషనల్ హైవేలోని  సీసీ కెమెరాలో కనిపించారు.
5.30 గంటలకు పడిపోయిన ప్రవీణ్ ను  పోలీసులు రామవరప్పాడు రింగ్‌ వద్ద ట్రాఫిక్‌ బూత్‌ వద్దకు తీసుకొచ్చారు.
5.30- 8.20 గంటల వరకు బూత్‌ ఎదురుగా గడ్డిలో ప్రవీణ్  నిద్రపోయారు.
రాత్రి 8.47 గంటలకు రామవరప్పాడు రింగ్‌ నుంచి ఏలూరు వైపు వెళ్లారు.

Advertisment
Advertisment
Advertisment