Minister Narayana : చంద్రబాబు Vs పవన్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి AP: కూటమిలో విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారాయణ స్పందించారు. ఆ ప్రచారాన్ని ఖండించారు. కూటమిలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని చెప్పారు. By V.J Reddy 05 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Minister Narayana: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ఇంఛార్జి బాధ్యత తీసుకున్నారు మంత్రి నారాయణ. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి గా బాధ్యతలు ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. మొదటిసారి జిల్లాలో కూటమిలోని మూడు పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. Also Read : అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు చిన్న సమస్యలు కామన్.. ఏ పార్టీలో అయినా చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉంటాయని అన్నారు. అలాంటిది మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని చెప్పారు. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం మూడు పార్టీల సమన్వయంతో పాటు ప్రజా సమస్యలపై ఇంఛార్జి మంత్రిగా ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారులతో సమీక్ష నిర్వహించలేదని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జిలు తమ నియోజకవర్గం అభివృద్ధిపైనే ఎక్కువగా చర్చించినట్లు తెలిపారు. Also Read : క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR జగన్ ఖాళీ చేశాడు... జగన్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయాడని మండిపడ్డారు. రూ.10 లక్షల కోట్లు అప్పుచేసి జగన్ వెళ్ళిపోయాడని ఆరోపణలు చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడేసుకున్నాడని అన్నారు. అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశాడని ఫైర్ అయ్యారు. తన అనుభవంతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఖజానా ఖాళీ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం అని చెప్పుకొచ్చారు. Also Read : ఛీ..ఛీ.. స్కూల్‌లోనే టీచర్ పాడు పని! ఎలాంటి కుమ్ములాటలు లేవు... మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తామన్నారు. అమరావతిపై 2014 లోనే అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం కూడా పార్లమెంట్ లో సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రతినెలా మూడుసార్లు ఇంఛార్జి మంత్రిగా కాకినాడ జిల్లాకు వస్తాను అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీలు,కార్పొరేషన్ లకు త్వరలో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించినట్లు తెలిపారు. కూటమి పార్టీల్లో ఎలాంటి కుమ్ములాటలు లేవని మరోసారి క్లారిటీ ఇచ్చారు. Also Read : హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి