ఇవి ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. మంత్రి సంచలన ప్రకటన!

AP: ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుందని అన్నారు మంత్రి నాదెళ్ల మనోహర్. 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయన్నారు. ఈ పథకానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు అని పేర్కొన్నారు.

New Update
BREAKING: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

Free Gas Cylinder: ప్రజల ఆశలకూ అనుగుణంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు అందిస్తామన్నారు. ఈ నెల 29 ఉదయం 10 గంటలు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు.

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి...

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

మొదటి గ్యాస్ సిలిండర్ అక్టోబర్ 31 నుండి మార్చి 31 లోగా బుక్ చేసుకోవచ్చని ఆయన అన్నారు. 48 గంటల్లోగా ఇంటికి గ్యాస్ సిలిండర్ అందేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామన్నారు. ఈ పథకం పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుండి జులై 31 లోగా రెండో సిలిండర్ బుక చేసుకునేలా అవకాశం కల్పించినట్లు చెప్పారు. డిసెంబర్ 1 నుండి మార్చి 31 లోగా 3 వ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. ఏడాదికి దాదాపు రూ.2,684.75 కోట్లు ఈ పథకానికి కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులూ ఉన్న ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం  అని అన్నారు.

ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ

ఇది కూడా చదవండి: మంత్రి కొండా సురేఖకు షాక్!

Advertisment
Advertisment
తాజా కథనాలు