లోకేష్ రెడ్ బుక్ 3.0.. టార్గెట్ వంశీ, కొడాలి నాని!

AP: త్వరలోనే రెడ్‌బుక్‌ చాప్టర్‌ -3 ఓపెన్‌ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. కాగా రెడ్‌ బుక్‌ చాప్టర్‌-3లో వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వారిని త్వరలో అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

New Update
LOKESH VAMSHI

Lokesh: రెడ్‌బుక్‌పై మంత్రి లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రెడ్‌బుక్‌ చాప్టర్‌ -3 ఓపెన్‌ అవుతుందని అన్నారు. చాప్టర్‌-1 అయిపోయింది, చాప్టర్‌-2 నడుస్తోంది... త్వరలోనే చాప్టర్‌-3 మొదలవుతుందని చెప్పారు. అందులో ఎవరి పేర్లు ఉంటాయో త్వరలో తెలుస్తుందని అన్నారు. కావాలంటే యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాముని అడగండి అని సూచించారు. ఆ సమయంలో లోకేష్‌ పక్కనే ఉన్న వెంకట్రావు, వెనిగండ్ల రాము ఉన్నారు. అమెరికా పర్యటనలో లోకేష్‌ చేసిన వ్యాఖ్యలతో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. లోకేష్‌ వ్యాఖ్యలను బట్టి రెడ్‌ బుక్‌ చాప్టర్‌-3లో వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వంశీపై గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!

టీడీపీ నుంచి వైసీపీలోకి...

వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు తమ రాజకీయ పాఠాలను టీడీపీ నుంచే ప్రారంభించారు. ఎమ్మెల్యేగా కూడా సైకిల్ గుర్తు మీదే గెలిచి అసెంబ్లీ గేటు తొక్కారు. అయితే.. కొన్ని కారణాల వల్ల  ఇద్దరు నేతల్లో ముందుగా.. కొడాలి నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు.. కానీ వైసీపీలో చేరలేదు. రాజీనామా సమయంలో ఇద్దరు నేతలు కూడా చంద్రబాబుపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. బూతుపురాణం మొత్తం చదివారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు సతీమణితో సహా కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

Also Read:  పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!

చంద్రబాబు కన్నీళ్లు...

ఆనాడు చంద్రబాబు వారు చేసిన వ్యాఖ్యలకు అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేసి.. మళ్లీ సీఎం అయ్యే వరకు తాను అసెంబ్లీకి అడుగుపెట్టబోనని శబదం చేశారు. ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకున్నారు. తనను రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ.. రాజకీయాలకు దూరంగా ఉంటున్న తన కుటుంబ సభ్యులపై భూతులు తిట్టడం ఏంటి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆనాటి నుంచి చంద్రబాబు అసెంబ్లీకి వెళ్ళలేదు. తాజాగా ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో తిరిగి సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు. కాగా ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయం కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. ఇందులో నిందితుడిగా వంశీని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి లోకేష్ అంటున్న మూడో రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉండబోతున్నాయనే దానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు