BIG BREAKING: తిరుమల ప్రసాదంలో జెర్రీ! AP: తిరుమలలో టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి దర్శనమిచ్చింది. దీనిపై టీటీడీ అధికారులను భక్తులు ప్రశ్నించగా.. నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 05 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tirumala: తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా రచ్చ లేపుతుంటే.. తాజాగా టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి రావడం కలకలం రేపింది. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి దర్శనమిచ్చింది. అన్నప్రసాదంలో జెర్రి కనపడంపై టీటీడీ యాజమాన్యాన్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా తమను వెళ్ళిపోమన్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయమే అన్నదానం పై టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు దీనిపై టీటీడీ అధికారులు ఇంకా స్పందించలేదు. తిరుమల : బ్రేకింగ్తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రిటిటిడి మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రిఅన్నప్రసాదంలో జెర్రి కనపడంపై టిటిడి యాజమాన్యాన్ని ప్రశ్నించిన భక్తలు.#tirumalatemple #TirumalaLadduControversy #TirupatiPrasadam #RTV pic.twitter.com/smGdhFJDG5 — RTV (@RTVnewsnetwork) October 5, 2024 నిన్న తిరుమలలోనే సీఎం.. నిన్న తిరుమల శ్రీవారి సేవలో ఉన్నారు సీఎం చంద్రబాబు. అనంతరం శ్రీవారి లడ్డూ నాణ్యతపై ఆయన అధికారులతో కలిసి సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. ''లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగాలి. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల క్వాలిటీ బాగుండేలా చూడాలి. అత్యుత్తమ పదార్థాలనే వాడాలి. ఏ విషయంలో కూడా రాజీపడొద్దు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి ఉండకూడదు. సింపుల్‌గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి. ఆర్భాటం, అనవసర ఖర్చులు వద్దు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు. భక్తుల ప్రశాంతతకు ఎక్కడా కూడా భంగం కలిగించకూడదు. దురుసు ప్రవర్తన ఎక్కడా కనిపించకూడదు. తిరుమలలో ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలని'' సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి