IT Rides: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో IT రైడ్స్! AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసం, ఆఫీసులో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. By V.J Reddy 06 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి YCP EX MLA: భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసం, ఆఫీసులలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కాగా ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read : US Elections 2024: ప్రజాస్వామ్యం కన్నా పైసలే ముఖ్యం.. ట్రంప్ ఆధిక్యంపై ఆసక్తికర సర్వే! ఇటీవల పార్టీ మారుతారనే చర్చ... ఇటీవల భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఆయన టీడీపీ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగింది. కాగా ఆయన ఇంకా పార్టీ మార్పు పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో జరుగుతున్న చర్చకు మరింత బలం చేకూరింది. Also Read : Refrigerator: ఫ్రిజ్లో ఈ సీక్రెట్ బటన్ ఇలా వాడితే... తాజా ఆహారం మీ సొంతం అధిష్టానానికి దూరంగా... ఎన్నికలు అయ్యాక పార్టీ కార్యకలాపాలకు దూరంగా శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. అన్ని సెట్ అయితే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమని ఆయన అనుచరుల్లో మాట వినిపిస్తోంది. ఇటీవల జిల్లాలోని నియోజకవర్గ ఇంఛార్జ్ లతో సిఎం జగన్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ డుమ్మా కొట్టారు. 2019 లో సినీ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచిన తనకు సరైన పదవి ఇవ్వకపోవడంతో అప్పట్లోనే వైసీపీ అధిష్టానంపై శ్రీనివాస్ అలిగారు. పార్టీ మారుతున్నట్లు తెలుసుకున్న అధిష్టాన నేతలు శ్రీనివాస్ ను బుజ్జగించే పనులు పడ్డారు. మరి ఆయన పార్టీ మారుతారో లేదో వేచి చూడాలి. Also Read : US: దూసుకుపోతున్న ట్రంప్.. 17 రాష్ట్రాల్లో ..188 ఎలక్ట్రోరల్ ఓట్లతో! Also Read : వాహనదారులకు షాక్.. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతంటే! #it-rides #ycp-ex-mla-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి