Chandra Babu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు!
ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.
ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.
ఏపీ అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో వారి నాయకత్వంలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. మంగళగిరిలో లోకేష్ తన విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి లావణ్యపై భారీ మెజార్టీతో గెలిచారు.
AP: కాసేపట్లో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. కూటమి భారీ విజయం దిశగా అడుగులు వేస్తుండడంతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. కాగా ఈ నెల 9న కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
AP: సీఎం జగన్ రాజీనామా చేయనున్నారు. కాసేపట్లో రాజభవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే.
AP: ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నేతలు, అధికారులతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగో సారి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు.
AP: గుంటూరు జిల్లాలో కూటమి క్లిన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు తమ హవా చూపించారు. కాగా రాజధాని అంశం గుంటూరు జిల్లాలో వైసీపీ, జగన్ ను దెబ్బసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 160 సీట్లలో కూటమి లీడ్ లో ఉంది.