ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు అమరావతికి సీఎం చంద్రబాబు AP: ఈరోజు అమరావతిలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. సీఎం హోదాలో తొలిసారిగా అమరావతిలో పర్యటిస్తున్నారు. కాగా ఇటీవల రాష్ట్ర రాజధానిగా అమరావతి అని చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు CM Chandrababu : రేపు అమరావతికి చంద్రబాబు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్న సీఎం.! సీఎం చంద్రబాబు రేపు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఉ.11 గంటలకు పరిశీలించనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీస్ అధికారులు, జడ్జిల క్వార్టర్స్ ను పరిశీలించనున్నారు. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు AP: పామాయిల్ ట్యాంకర్ బోల్తా.. నూనె కోసం ఎగబడ్డ స్థానికులు..! పల్నాడు జిల్లా పెదనెమలిపురి సమీపంలో పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో పామాయిల్ కోసం స్థానికులు బకెట్లు, బిందెలతో ఎగబడ్డారు. ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government : వైసీపీ కోసం పని.. ప్రభుత్వం నుంచి జీతాలు.. వెలుగులోకి భారీ కుంభకోణం? AP: గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. వైసీపీకి పని చేయించుకుని ప్రభుత్వం నుంచి వేల మందికి లక్షల్లో జీతాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సిద్ధమైంది. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meet: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ AP: ఈనెల 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్లో చర్చించాల్సిన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: లోక్సభలో 6వ అతిపెద్ద పార్టీగా టీడీపీ 18వ లోక్సభలో సంఖ్యాపరంగా టీడీపీ ఆరో అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ- 240, కాంగ్రెస్ - 99, సమాజ్వాదీ పార్టీ- 37, తృణమూల్ కాంగ్రెస్- 29, డీఎంకే - 22 టాప్ ఐదు స్థానాలలో ఉన్నాయి. 16 ఎంపీలతో టీడీపీ 6వ స్థానం.. నలుగురు ఎంపీలతో వైసీపీ 15వ స్థానంలో ఉంది. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: కాసేపట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత , పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 9:30కి విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: అడ్వకేట్ జనరల్ గా దమ్మలపాటి శ్రీనివాస్ ఏపీ అడ్వకేట్ జనరల్ గా ప్రముఖ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం మారిన తర్వాత అడ్వకేట్ జనరల్, అదనప్ అడ్వకేట్ జనరల్ రాజీనామాలు చేశారు. ప్రస్తుతం నూతనంగా నియామకమైన దమ్మలపాటి శ్రీనివాస్ గత చంద్రబాబు హయంలోనూ ఏజీగా పని చేశారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ముఖ్య నాయకులు..! వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు కలిశారు. తన క్యాంపు కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత క్రమంగా పార్టీ నాయకులతో జగన్ వరుస భేటీలను నిర్వహిస్తూ వస్తోన్నారు. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn