Chandrababu: మద్యం షాపులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్!

AP: మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఒకవేళ రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్, తరువాత కూడా తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేయాలని అన్నారు.

New Update
chandrababu

CM Chandrababu: మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొత్త మద్యం పాలసీ అమలు విధానాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మద్యం ధరల విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం. మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సిఎం ఆదేశం ఇచ్చారు. ఎంఆర్పికి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్ వేయాలని, తరువాత కూడా తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని అధికారులకు సిఎం ఆదేశం ఇచ్చారు.

ఇది కూడా చదవండి: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర'

బెల్ట్ షాపులకు నో పర్మిషన్...

ఎట్టిపరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. లిక్కర్ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మే లిక్కర్ షాపులకు మొదటి సారి తప్పు చేస్తే రూ. 5 లక్షలు అపరాధ రుసుము విధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలని సిఎం ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా ఉండాలన్న సిఎం...NDPL(non duty paid liquor) రాకుండా చూడాలని చెప్పారు.

ఇది కూడా చదవండి: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు!

సిసి కెమేరాలు...

ప్రతి షాపులో సిసి కెమేరాలు ఉండేలా చూడాలని, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు సీఎం. ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి షాపు వద్ద మద్యం ధరల పట్టిక తప్పకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు.     మద్యం షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు, మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలని సూచనలు చేశారు. 

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు!

ఇది కూడా చదవండి:  బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు