YS Jagan: పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయిన రోజా.. ఆ నేతలు ఔట్! నగరిలో గత ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పని చేసిన నాయకులపై హైకమాండ్ వేటు వేసింది. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడైన కేజే కుమార్ ఉన్నారు. సీఎం జగన్ తో రోజా భేటీ అయ్యి.. 24 గంటలు కూడా కాకముందే వీరిపై వేటు పడడం చర్చనీయాంశమైంది. By Nikhil 13 Sep 2024 | నవీకరించబడింది పై 13 Sep 2024 14:05 IST in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి మాజీ మంత్రి రోజా పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఆమె సైలెంట్ గా ఉన్నారు. మీడియాకు సైతం దూరం ఉంటూ వస్తున్నారు. ఓ దశలో ఆమె వైసీపీకి రాజీనామా చేస్తారంటూ ప్రచారం కూడా సాగింది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలో వస్తున్న కొత్త పార్టీలో రోజా చేరనున్నారంటూ వార్తలు కూడా గుప్పుమన్నాయి. అయితే.. ఆ వార్తలకు చెక్ పెడుతూ నిన్న వైసీపీ అధినేత జగన్ ను కలిశారు రోజా. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై జగన్ కు ఫిర్యాదు చేశారు. వారు పార్టీకి ఎలా వెన్నుపోటు పొడిశారనే విషయంపై జగన్ కు రోజా వివరించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Arekapudi : అరికెపూడి ఇంటి వద్ద హైటెన్షన్.. కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్! జగన్ ఆదేశాలతో.. ఈ నేపథ్యంలో జగన్ ఆయా నేతలపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వెంటనే రోజాకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై వేటు వేయాలని నేతలకు జగన్ సూచించారు. దీంతో ఆయా నేతలపై వేటు పడింది. నగరికి చెందిన కేజే కుమార్‌తో పాటు, మున్సిపల్ మాజీ చైర్మన్‌పైనా సస్పెన్షన్ విధించింది పార్టీ. ఈ మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ లేఖ విడుదల చేశారు. అయితే.. వీరిద్దరూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులేనని తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డికి ఈ పరిణామం బిగ్ షాక్ అన్న ప్రచారం సాగుతోంది. సొంత పార్టీ నేతలు తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఎన్నికల ముందు సైతం రోజా ఆరోపించారు. పార్టీ పెద్దలకు సైతం ఫిర్యాదు చేశారు. వైసీపీలో ఉంటూ టీడీపీ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల రోజు సైతం రోజా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా మాజీ సీఎం జగన్ ను సైతం రోజా కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీంతో సీరియస్ అయిన జగన్ ఆయా నేతలపై బహిష్కరణ వేటు వేశారు. #roja #ap-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి