New Update
/rtv/media/media_files/2025/02/24/rcE1LgtM8Zwjj9BIJIaV.jpg)
YS Jagan Pulivendula Tour
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు, ఎల్లుండి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు. స్ధానిక నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఎల్లుండి అంటే ఈ నెల 26న ఉదయం 10 గంటలకు పులివెందుల గుంత బజార్ రోడ్డులో వైయస్‌ఆర్ ఫౌండేషన్, ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్‌ను జగన్ ప్రారంభించనున్నారు.
24.02.2025
— YSR Congress Party (@YSRCParty) February 24, 2025
తాడేపల్లి
రేపు, ఎల్లుండి (25.02.2025, 26.02.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ @ysjagan పులివెందుల పర్యటన వివరాలు
25.02.2025 షెడ్యూల్
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు, స్ధానికంగా అందుబాటులో ఉంటారు.…
AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!
అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు.
Purandeshwari
AP News: అమరావతి రాజధానికి మోడీ సర్కార్ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు కేంద్రం అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు వెల్లడించా. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు పట్టం కట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అమరావతి నిర్మాణానికి, అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ చెప్పినట్లు గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం..
వరల్డ్ బ్యాంకు ద్వారా 15వేల కోట్లు, హడ్కో కింద 11వేల కోట్లు ఏపీకి అందించడానికి నిర్ణయం చేశారు. హడ్కో కింద 11వేల కోట్ల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో నేడు ఒప్పందం చేసుకున్నారు. 15వేల కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు కలిపి 13వేల 600కోట్లు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1400కోట్లు అందిస్తుంది. ఈ 15వేల కోట్లు మొబలైజేషన్ లో 25శాతం గ్రాంట్ కింద ఇస్తామని కేంద్రం చెప్పిన విధంగా ఇటీవల 4వేల 285 కోట్లు కేంద్రం అందించింది. కేంద్రం నుంచి వచ్చే సహకారాన్ని అందిపుచ్చుకుంటూ అమరావతిని అద్భుతంగా అభివృద్ది చేయాలని కోరుతున్నాను అని పురంధేశ్వరి వివరించారు.
Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
bjp-purandeswari | amaravathi | telugu-news | today telugu news
Life Style: 20-20-20 ఫార్ములా ఎప్పుడైనా ట్రై చేశారా? స్క్రీన్స్ ముందు ఉండేవారికి ఇది చాలా ముఖ్యం
Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
Iphone 15 Price Drop: ఐఫోన్ 15పై బిగ్గెస్ట్ డిస్కౌంట్ భయ్యా.. వదిలారో మళ్లీ మళ్లీ రాదు!
Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్