విద్యార్థులకు అలెర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు! AP: పాఠశాలల దసరా సెలవుల్లో మార్పు చేసింది విద్యాశాఖ. తొలుత అక్టోబర్ 4 నుంచి 13 వరకు సెలవులను ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థనలు రాగా.. ఈ సెలవులను అక్టోబర్ 3 నుంచి 13 వరకు మార్చారు. 14న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. By V.J Reddy 01 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Dussehra Holidays: దసరా సెలవుల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల అక్టోబర్ 4 నుంచి 13 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఆ సెలవుల్లో మార్పులు చేసింది బాబు సర్కార్. ఉపాధ్యాయుల సంఘాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు సెలవులను ఒకరోజు పెంచారు. అక్టోబర్ 4 నుంచి కాకుండా ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 3 నుంచి 13 వరకు మార్చారు. 14న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 11 రోజుల పాటు ఏపీలో విద్యాసంస్థలు మూతపడనున్నాయి. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రేపటి నుంచే... తెలంగాణలో రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దసరా పండగ నేపథ్యంలో మొత్తం 13 రోజుల పాటు సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి (బుధవారం) నుంచి 14వ తేదీ(సోమవారం) వరకు సెలవులుగా ప్రకటించింది. ముందుగా గాంధీ జయంతికి సెలువు ఉండగా.. ఆ త ర్వా త నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని వి ద్యా శా ఖ అధికారులు తెలిపారు. ఇ ప్ప టి కే కొ న్ని ప్రై వే ట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అంటే ఈరోజు నుంచే దసరా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక జూనియర్ కాలేజీల విషయానికి వస్తే అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 13 రోజులు.. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అంటే మొత్తంగా 13రోజులు సెలవుల తర్వాత అక్టోబర్ 15న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఇక కాలేజీలు అక్టోబర్ 14న తెరుచుకోనున్నాయి. వరుసగా 13 రోజులు సెలవులు అని ప్రకటించడంతో విద్యార్థుల సంతోషానికి అవధులు లేవు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి