జగన్కు షాక్.. Janasenaలో చేరిన మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు! ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేన గూటికి చేరారు. వారికి పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేత అవనపు విక్రమ్ దంపతులు సైతం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. By Nikhil 26 Sep 2024 | నవీకరించబడింది పై 26 Sep 2024 19:41 IST in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Balineni Szrinivasa Reddy : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య ఈ రోజు జనసేనలో చేరారు. వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజానీకానికి ఒక దశా దిశ పవన్ కళ్యాణ్ మాత్రమేనన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. ఐదేళ్లలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు. జనసేన పార్టీ తనకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదన్నారు. పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా పని చేస్తానన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులు అందరిపై ఉందన్నారు. త్వరలో గుంటూరు నుంచి చేరికలు త్వరలో గుంటూరు నియోజకవర్గం నుంచి పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే ధూళిపాళ్లతో కలిసి పని చేస్తానన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు. Also Read : మూడు సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని.. #ys-jagan #ap-politics #janasena #balineni-srinivasa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి