AP: దారుణం.. ప్రేమజంటకు ఆశ్రయం కల్పించినందుకు యువకుడిపై పెట్రోలు పోసి..

పశ్చిమ గోదావరి జిల్లా మైసన్నగూడేంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమజంటకు ఆశ్రయం ఇచ్చినందుకు యువకుడి ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. భయపడిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

New Update
AP:  దారుణం.. ప్రేమజంటకు ఆశ్రయం కల్పించినందుకు యువకుడిపై పెట్రోలు పోసి..

West Godavari: ప్రేమజంటకు ఆశ్రయం కల్పించినందుకు యువకుడి కుటుంబంపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో చోటుచేసుకుంది. సహాయం చేసినందుకు యువకుడిపై పెట్రోలు పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కంపేటకు చెందిన ప్రేమికులు పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అనంతరం యువకుడి బంధువైన మైసన్నగూడేనికి చెందిన రాజు అనే వ్యక్తి వారికి ఆశ్రయం కల్పించాడు. దీంతో అతడిపై కోపంతో యువతి తరపు బంధువులు నిన్న రాజు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు.

Also Read: నేను ఆ తప్పు చేయలేదు.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు: జనసేన ఇంచార్జ్

ఈ క్రమంలో యువతి బంధువులు తప్పించుకునే ప్రయత్నం చేసిన రాజుపై పెట్రోలు పోసి సజీవ దహనం చేసే యత్నం చేయగా స్థానికులు కల్పించుకుని వారిని అడ్డుకున్నారు. అక్కంపేట సర్పంచ్ పారేపల్లి నాగేంద్ర తోపాటు మరో 50 మందికి పైగా తనపై దాడి చేసినట్టు బాధితుడు రాజు ఆరోపించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తన తల్లి కనకదుర్గ, మేనత్త శశిరేఖపైనా నిందితులు దాడి చేసినట్టు రాజు పేర్కొన్నాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఈ దాడి విషయం తెలిసి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert:  ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?

వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.

New Update
  Rain Alert For Telangana

Rain Alert

Rain Alert : వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే , మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కు మార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
 
ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో  భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
 
అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల22 నుంచి27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

 

 

Advertisment
Advertisment
Advertisment