AP Elections 2024: ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

AP: కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి పయనమయ్యారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏపీలో పోలింగ్ తరవాత జరిగిన ఘటనల పైన నివేదిక ఇవ్వనున్నారు.

New Update
AP Elections 2024: ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన దాడులు. ఏపీలోని కొన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద వైసీపీ, కూటమి నేతల గొడవకు దిగారు. పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ జరిగిన దాడుల్లో అనేక మందికి గాయాలు అయ్యాయి. మరికొన్ని చోట్లలో ఈవీఎం మిషన్ లను ధ్వంసం చేశారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కి అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల పోలింగ్ ఆపేయాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏపీలో ఎన్నికలు ఇంత దారుణంగా జరుగుతాయనే విధంగా ఎన్నికలు ముగిశాయి.

ALSO READ: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కేనా?

ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై ఈసీ సీరియస్ అయ్యింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇద్దరు అధికారులను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి పయనమయ్యారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏపీలో పోలింగ్ తరవాత జరిగిన ఘటనల పైన నివేదిక ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేవారు. 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోందన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు