Narayana: అనుమతి లేని లే అవుట్ లకు భారీ పెనాల్టీ: మంత్రి నారాయణ

అనుమతి లేకుండా చేసే లే అవుట్ లకు భారీగా పెనాల్టీ విధించే ఆలోచన చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. సెంట్రల్ డివైడర్ లలో ఎలాంటి వాణిజ్య ప్రకటనల బోర్డులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్పొరేషన్‌ల కమిషనర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

New Update
AP: పిడుగురాళ్లలో 80 డయేరియా కేసులు: మంత్రి నారాయణ

Minister Narayana: వర్షాకాలంలో రోడ్లపై ఎక్కడా నీరు నిల్వలేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ల కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. డ్రైన్ లలో పూడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. విజయవాడతో సహా పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్ లతో సీడీఎంఎ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు.

దిశానిర్దేశం..

వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు ఆయా కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. నిన్న విజయవాడలో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీరు నిలవడానికి గల కారణాలపై కమిషనర్ ధ్యాన చంద్రను అడిగి తెలుసుకున్నారు. విజయవాడతో పాటు ఇతర కార్పొరేషన్లలో రోడ్లపై నీరు నిల్వ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

Also Read: టీచర్లకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్..!

భారీ పెనాల్టీ..

అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, పార్కులు, వీధి దీపాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. అనుమతి లేని లేఅవుట్ ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. పెనాల్టీ తక్కువగా ఉందని ఉద్దేశంతో లేఔట్ లకు ముందుగా అనుమతి తీసుకోవడం లేదని..అవసరం అయితే అనుమతి లేకుండా చేసే లే అవుట్ లకు భారీగా పెనాల్టీ విధించే ఆలోచన చేస్తామన్నారు. లేఅవుట్ ల అనుమతుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కమిషనర్లను ఆదేశించారు. పట్టణాల్లో కొళాయి కనెక్షన్ ల సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు.

పశువుల సంచారం లేకుండా..

మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు, పందులు కనపడకూడదని.. దానికి తగినట్లుగా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే 15 రోజుల్లోగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో రోడ్లపై పశువుల సంచారం లేకుండా చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు..ఇక వీధి కుక్కలకు త్వరితగతిన స్టేరిలైజేషన్ ఆపరేషన్ లు చేయించడంతో పాటు పెంపుడు కుక్కలు వీధుల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: బీభత్సం సృష్టించిన యూట్యూబర్‌.. షాకిచ్చిన పోలీసులు..!

బోర్డులు లేకుండా..

సెంట్రల్ డివైడర్ లలో ఎలాంటి వాణిజ్య ప్రకటనల బోర్డులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. చెత్త శుద్ధి నిర్వహణ, పార్కుల నిర్వహణపైనా అధికారులకు మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు.పేదల గృహాల కోసం నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, మెప్మా ఎండీ తేజ్ భరత్, టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ విద్యుల్లత, ప్రజారోగ్య విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాల కృష్ణా రెడ్డి తోపాటు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు