Anitha: జగన్ తెలుసుకుని మాట్లాడు.. హోం మంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్..! ఫార్మా కంపెనీల బాధితులకు పరిహారం చెల్లించకపోతే ధర్నా చేస్తానని జగన్ చేసిన కామెంట్స్‌కు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ముందు.. బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిపై జగన్ ధర్నా చేయాలన్నారు. బాధితులకు పరిహారం చెల్లించామని.. జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. By Jyoshna Sappogula 24 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Home Minister Anitha: అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. జగన్ మృతుల దగ్గరికి వెళ్లి నవ్వుతాడు, బాధితుల దగ్గరికి వెళ్లి సరదాలు చేస్తాడని మండిపడ్డారు. ఫార్మా కంపెనీల బాధితులకు పరిహారం చెల్లించకపోతే ధర్నా చేస్తానని జగన్ చేసిన కామెంట్స్‌కు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ముందు.. బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిపై జగన్ ధర్నా చేయాలన్నారు. జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. Also Read: తప్పు ఎవరిది? జీహెచ్‌ఎంసీ ఎందుకు అనుమతులిచ్చింది? ఆ నష్టపరిహరం ఎవరిస్తారు? అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన జగన్ .. ప్రభుత్వం వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎల్జి పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన వారికి రూ. 20,000, పాక్షికంగా గాయపడిన వారికి రూ. 10000 ప్రకటించారని తెలిపారు. పాలిమర్స్ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, ముగ్గురు మృతులకు ఇప్పటికీ కోటి రూపాయల పరిహారం అందలేదన్నారు. ఎసెన్షియ ప్రమాద ఘటనలో మృతి చెందిన 17 మంది మృతులకు, 36 మందికి క్షతగాత్రులకు ఆర్ టి జి ఎస్ ద్వారా డబ్బులు పంపడం జరిగిందన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తెలిసి తెలియకుండా శవాలు మీద పేలాలు ఏరుకున్నట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ ఎప్పటికి అప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రమాద బాధితులకు న్యాయం చేశారన్నారు. ఎల్జి పాలిమర్స్ వద్ద వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రూ. 150 కోట్లు ఎవరి జేబిల్లోకి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు. #home-minister-anitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి