Minister Suresh: సమ్మె యథాతథం..ప్రభుత్వంతో మున్సిపల్ కార్మిక సంఘాల చర్చలు విఫలం! ఏపీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సంఘం నేతలతో ప్రభుత్వాధికారులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు మున్సిపల్ కార్మికుల సంఘాల నేతలు తెలిపారు. By Bhavana 02 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీ (AP) వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు (Muncipal Workers) చేపట్టిన ధర్నాతో ప్రభుత్వాధికారులు దిగి వచ్చి..కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో మరోసారి కార్మికులు సమ్మెకి రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల వారికి వేతనాలు పెంచడం అనేది సాధ్యం కాదని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. మున్సిపల్ కార్మికుల ప్రధాన డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం గురించి మంత్రులు అసలు చర్చించనే లేదని కార్మికుల సంఘం నేత ఉమా మహేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో వైసీపీ సమాన పనికి సమాన వేతనం అని వివరించింది. కానీ ఇప్పుడు అడిగితే ఎవరు వినే పరిస్థితుల్లో కూడా లేరని కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు. మేము చేపట్టిన ఉద్యమాన్ని ప్రభుత్వాధికారులు తేలిగ్గా తీసుకున్నారు. చెత్త పన్ను వేశారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, ఆస్తి పన్ను పెంచారు కానీ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం వీరి దగ్గర డబ్బులు లేవు అంటూ కార్మిక సంఘాల నేతలు ఎద్దేవా చేశారు. దీని గురించి మున్సిపల్ కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ...'' సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. అన్ని మున్సిపాలిటీల్లో నీళ్లు, పారిశుద్ద్యం పూర్తిగా నిలిపివేస్తామని ప్రభుత్వానికి చెబుతామన్నారు. నిరసన తెలియచేస్తూనే కార్మికులను అరెస్ట్ చేస్తారా? 11 పీఆర్సీలో కనీస వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. పారిశుద్ద్య పరిస్థితులు పట్ల మేమే ఆందోళన చెందుతున్నాం. ప్రజల ప్రాణాలు అంటే ముఖ్యమంత్రికి లెక్క లేనితనంగా ఉంది" అని మున్సిపల్ కార్మిక సంఘాల అధికారులు తెలిపారు. కార్మికులను సమ్మె విరమించాలని ఆ సంఘాలతో చర్చలు జరిపినట్లు మంతరి ఆదిమూలపు సురేష్ తెలిపారు. చర్చల తరువాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా ఇవ్వాలనుకున్నాం కానీ వారి డిమాండ్లు చాలా అధికంగా అక్కర్లేనివి గా ఉన్నాయని మంత్రి తెలిపారు. Also read: సంక్రాంతికి ఊరెళ్లలానుకుంటున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే! #muncipal-workers #samme #minister-adhimulapu-suresh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి