Anchor Suma: వారికి సారీ చెబుతూ స్టార్ యాంకర్‌ సుమ ఎమోషనల్..!

స్టార్ యాంకర్ సుమ మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పారు. స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారని ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ మేరకు యాంకర్ సుమ ఓ వీడియో విడుదల చేశారు. నిండు మనసుతో తనను క్షమించాలని అభ్యర్థించారు.

New Update
Anchor Suma: వారికి సారీ చెబుతూ స్టార్ యాంకర్‌ సుమ ఎమోషనల్..!

Star Anchor Suma Kanakala : టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చలాకైన మాటలతో గత కొన్ని సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నారు. ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో  ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే.  47 ఏళ్ల వయసు ఉన్నప్పట్టికి స్టిల్ యంగ్  గానే కనిపిస్తూ స్టార్ యాంకర్ అనే కిరిటాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలతో సూపర్ బిజీగా ఉన్నారు సుమ కనకాల.

publive-image

స్టార్ యాంకర్ సుమ మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పారు . ‘ఆదికేశవ’ మూవీలోని ‘లీలమ్మో’ సాంగ్ విడుదల వేదికపై చేసిన మీడియా సభ్యులపై చేసిన కామెంట్స్ వివాదాస్పద వ్యాఖ్యలు మారాయి. ఈ మేరకు యాంకర్ సుమ ఓ వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలు మీడియా వారిని ఇబ్బంది పెట్టాయని తనకు అర్థమవుతోందని విచారం వ్యక్తం చేశారు.

మీడియా సభ్యులను ఉద్దేశించి ‘స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు’ అంటూ ‘ఆదికేశవ’ మూవీలోని ‘లీలమ్మో’ సాంగ్ విడుదల వేదికపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు యాంకర్ సుమ క్షమాపణలు చెప్పారు.  నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నానని అన్నారు. మీడియావారు ఎంత కష్టపడి పనిచేస్తారో తనకు తెలుసునన్నారు. ‘ మీరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’ అని తెలియజేస్తూ యాంకర్ సుమ ఒక వీడియో విడుదల చేశారు.

కాగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ‘లీలమ్మో’ పాట విడుదల వేదికపై కూడా సుమ క్షమాపణలు కోరారు. ఈ ఈవెంట్‌కి యాంకర్‌గా వ్యవహరించిన సుమ ఓ సందర్భంలో ‘మీడియా వారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు’ అని ఆమె అన్నారు. అక్కడే ఉన్న ఓ మీడియా ప్రతినిధి ఈ వ్యాఖ్యలను ఖండించారు. అలా అనొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చాలా కాలంగా ఉన్న చనువుతోనే ఈ వ్యాఖ్యలు చేశానని, క్షమించాలని అదే వేదికపై ఆమె కోరిన విషయం తెలిసిందే.

publive-image

Also Read: మీతో పోల్చుకోవడమా? నెవ్వర్.. రజినీ ట్వీట్ కు బాలీవుడ్ బిగ్‌బీ షాకింగ్ రిప్లై..!

Advertisment
Advertisment
తాజా కథనాలు