ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా..సామాజిక వర్గాలతో సమావేశం!

ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన ఎట్టకేలకు ఈ నెల 29 కి ఫిక్స్ అయ్యింది. ఆ రోజు ఈవెనింగ్ 4 గంటలకు ఫిలింనగర్ విస్పర్ వ్యాలీలోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘ప్రజాస్వామ్య తెలంగాణ కోసం సామాజిక వర్గాల సమావేశం’ పేరుతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన మేధావులు ఇంకా ఆయా వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారు. పార్టీ అధ్యక్షుడి మార్పు తరువాత మొదటి సారి..అమిత్ షా రాష్ట్రానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  

New Update
ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా..సామాజిక వర్గాలతో సమావేశం!

ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన ఎట్టకేలకు ఈ నెల 29 కి ఫిక్స్ అయ్యింది. ఇక ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా వస్తున్నట్టు ఖరారు అయినప్పటికీ ఆయన టూర్ షెడ్యూల్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. దీంతో ఆయన హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం రూపొందించి.. దాన్ని పర్మిషన్ కోసం బుధవారం కేంద్ర హోంశాఖ కార్యాలయానికి పంపించింది.

Amit Shah to Ellundi Hyderabad..meeting with social groups!

ఆ షెడ్యూల్ ప్రకారం అయితే అమిత్ షా 29 న మధ్యాహ్నం స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఈవెనింగ్ 4 గంటలకు ఫిలింనగర్ విస్పర్ వ్యాలీలోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘ప్రజాస్వామ్య తెలంగాణ కోసం సామాజిక వర్గాల సమావేశం’ పేరుతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన మేధావులు ఇంకా ఆయా వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని చాలా మంది ప్రముఖులు కూడా అమిత్ షా తో భేటీ అవ్వనున్నారు.

తరువాత ఆయన శంషాబాద్ లోని నోవాటెల్ లో పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఎయిర్ పోర్ట్ కు చేరుకొని రాత్రే హస్తినకు బయల్దేరుతారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమిత్ షా స్వయంగా తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. మళ్లీ సౌత్ లో కమలం వికసించాలంటే తెలంగాణను గేట్ వే గా హైకమాండ్ నిర్ణయించుకున్న క్రమంలో తెలంగాణ వ్యవహారాలు అమిత్ షా యే చూసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో అమిత్ షా తెలంగాణలో తరుచుగా పర్యటిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించారు. కాని గుజరాత్ తుపాన్ ఇంకా దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం సభ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ టూర్లోనే ఖమ్మం సభ పెడదామని పార్టీ శ్రేణులు భావిస్తే..భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. అయితే పార్టీ అధ్యక్షుడి మార్పు తరువాత మొదటి సారి..అమిత్ షా రాష్ట్రానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు