KGF లేకపోతే యశ్ ఎవరు?..అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.!

నిర్మాణ వ్యయం వల్లే తాను పెద్ద సినిమాలకు దూరంగా ఉన్నానని టాలీవుడ్‌ నిర్మాత అల్లు అరవింద్‌ వెల్లడించారు. కెజిఎఫ్ రాకముందు యశ్ ఎవరు..? ఎంత పెద్ద హీరో అతను? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే KGF సినిమా ఆడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
KGF లేకపోతే యశ్ ఎవరు?..అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.!

Allu Arvind: ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ ప్ర‌తిసారీ అదొక బ‌ర్నింగ్ టాపిక్. సినిమా బ‌డ్జెట్లో స‌గం మొత్తాన్ని 'స్టార్ హీరో- స్టార్ డైరెక్ట‌ర్' జోడీకి పారితోషికంగా చెల్లిస్తుంటే, ఇక సినిమా మేకింగ్ కోసం నిర్మాత ఎక్క‌డి నుంచి డ‌బ్బు తేగ‌ల‌డు? అంటూ చాలా విమ‌ర్శ‌లు ఉన్నాయి. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జీవించి ఉన్న రోజుల్లో హీరోలు, ద‌ర్శ‌కులు రెమ్యునరేషన్ త‌గ్గించుకోవాల‌ని డిమాండ్ చేసేవారు. కానీ,ఆ ప‌రిస్థితి ఇప్ప‌టికీ మార‌లేదు స‌రికదా.. స్టార్ హీరోలు ఇప్పుడు అంద‌నంత ఎత్తులో ఉన్నారు. అందుకే ఇటీవ‌ల చాలా కాలంగా సినిమాల బ‌డ్జెట్లు పెర‌గ‌డం చర్చనీయాంశమైంది. అయితే ఇలా పెర‌గ‌డానికి హీరోనే కార‌ణం అని అంటే మాత్రం, తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఒప్పుకోవ‌డం లేదు.

Also Read: పవన్ పై కోపంతో వెనక్కి తగ్గిన డైరెక్టర్..?

లేటెస్ట్ గా ఓ ఈవెంట్లో అల్లు అరవింద్ కు కొన్ని ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ''గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్‌లు సినిమాలు తీయ‌కుండా ఎందుకు దూరంగా ఉంటున్నాయి? లేదా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడంలో ఎందుకు జాగ్రత్త పడుతున్నారు అని ప్ర‌శ్నించ‌గా, అల్లు అరవింద్ 'ఖర్చు' అని ఒక్క మాటలో సమాధానం ఇచ్చారు.“చెప్పాలంటే.. నిర్మాణ వ్యయంలో హీరోలు తీసుకునే రెమ్యూనిరేషన్ కేవలం అత్యధికంగా 20 నుంచి 25 శాతం. అందుకే హీరోల వల్ల ఖర్చు పెరిగిపోతుంది అనడం కన్నా.. పెంచిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని అనిపిస్తుంది నాకు. పేర్లు చెప్తే బాగోదు.. కొన్ని సినిమా నిర్మాణ వ్యయాలు ఎంతున్నాయో మీరు గమనించండి. తక్కువే ఉన్నాయి. హీరోలతో సంబంధం లేకుండా ఇవాళ పెద్దగా చూపిస్తే తప్ప, పెద్ద సినిమాలను ప్రేక్షకులు ఆదరించరు. కెజిఎఫ్ రాకముందు యశ్ ఎవరు.. ? ఎంత పెద్ద హీరో అతను? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే ఆ సినిమా ఆడింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు