నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్..!!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ జాతీయ అవార్డుతో తెలుగోడి సత్తా చాటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా..బన్నీ జాతీయ ఉత్తమ న‌టుడిగా తొలి పుర‌స్కారాన్ని అందుకున్నాడు. ‘పుష్ఫ’ చిత్రంలోని పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి గాను బెస్ట్ యాక్టర్ కేటగిరీలో జాతీయ అవార్డు అందింది. తెలుగు సినిమాతో బన్నీ రికార్డు క్రియేట్ చేశారు. 65 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అల్లు అర్జున్‌ జాతీయ స్థాయి అవార్డను సొంతం చేసుకున్నారు.

New Update
నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్..!!

Allu Arjun Received National Award : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ జాతీయ అవార్డుతో తెలుగోడి సత్తా చాటారు. రాష్టపతి ద్రౌపది (Droupadi Murmu) ముర్ము చేతుల మీదుగా..బన్నీ జాతీయ ఉత్తమ న‌టుడిగా తొలి పుర‌స్కారాన్ని అందుకున్నాడు. ‘పుష్ఫ’ చిత్రంలోని పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి గాను బెస్ట్ యాక్టర్ కేటగిరీలో జాతీయ అవార్డు అందింది.  తెలుగు సినిమాతో బన్నీ రికార్డు క్రియేట్ చేశారు.

Also Read: Sreeleela: సినిమాలో ఆ పాత్ర చేయవద్దని చాలామంది చెప్పారు

65 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అల్లు అర్జున్‌ జాతీయ స్థాయి అవార్డను సొంతం చేసుకున్నారు. 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో (69th National Film Awards) ఉత్తమ నటుడి (Best Actor)గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అవార్డు తీసుకోవడంతో తెలుగు ప్రేక్షకులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Also Read: Allu Arjun- అసలు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఇదే..!!

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ కథానాయకుడిగా 'పుష్ప.. ది రైజ్' (Pushpa Movie) సినిమాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నిలిచారు. తనకు అవార్డు రావడం చాలా అంటే చాలా సంతోషంగా ఉందని జాతీయ మీడియాతో ఆయన తెలిపారు. కమర్షియల్ సినిమాకు అవార్డు రావడం వ్యక్తగతంగా తనకు డబుల్ అచీవ్‌మెంట్ అని బన్నీ పేరొన్నారు. 'పుష్ప' సినిమాలో సిగ్నేచర్ డైలాగ్ చెప్పమని ఆయన్ను అడగ్గా.. ''నా మాతృభాషలో చెప్పడం నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది'' అంటూ ''తగ్గేదే లే'' అని చెప్పారు. సంప్రదాయకరమైన వేషధారణతో అల్లు అర్జున్ బ్రౌన్ సల్వార్ వైట్ సూట్ ధరించి.. కళ్ళజోడు..సింపుల్ స్టైలిష్ లుక్ లో ఉండగా..అతని భార్య అల్లు స్నేహ రెడ్డి మట్టి గోధుమ రంగుతో కూడిన ట్రేడషనల్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. దీంతో ఈ జంటను చూసిన ఆడియన్స్.. సెలబ్రేటిస్ వావ్ అంటున్నారు.


'పుష్ప' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఆ సంస్థ నిర్మించిన 'ఉప్పెన' ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అందుకుంది. దర్శకుడు సానా బుచ్చిబాబు (Buchi Babu Sana)తో పాటు నిర్మాత నవీన్ యెర్నేని, రవిశంకర్ సైతం అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. జాతీయ మీడియాలో బుచ్చి బాబు కూడా తెలుగులో మాట్లాడారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు