రైతన్నా పంటను రక్షించుకో... వ్యవసాయ యూనివర్సిటీ సూచనలు..!

ఎడతెరపి లేని వానలు రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. దీంతో రైతన్నకు తీవ్రపంట నష్టం జరుగుతోంది. వర్షాల నుండి తద్వారా వచ్చే తెగుళ్ల నుండి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు.

New Update
రైతన్నా పంటను రక్షించుకో... వ్యవసాయ యూనివర్సిటీ సూచనలు..!

ఎడతెరపి లేని వానలు రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. దీంతో రైతన్నకు తీవ్రపంట నష్టం జరుగుతోంది. వర్షాల నుండి తద్వారా వచ్చే తెగుళ్ల నుండి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు.

publive-image
పొలాల్లోకి వచ్చిన నీటిని లోతు కాలువల ద్వారా బయటికి తీసివేయాలని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా అంతరకృషి చేసుకోవాలని కోరారు. 20 రోజులు దాటిన పంటలకు ఇప్పుడు ఎరువులను వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వెల్లడించారు.

ఈ వర్షాలు వరి సాగుకు అనుకూలంగా మారాయి. ఇది వరకే నార్లు పోసుకున్న వారు నాట్లు పూర్తి చేసుకోవాలి.నార్లు పోసుకున్న వారు నాట్లు పూర్తి చేసుకోవాలి. నార్లు మొదలు పెట్టని వారు స్వల్పకాలిక విత్తనాలు వెదజల్లుకోవాలి.

publive-image

ఎకరాకు సరిపోయే నారుమడిలో 800 గ్రా. కార్బోఫ్యూరాన్‌ గుళికలు నారును తీయడానికి ఐదు నుంచి వారం రోజులు ముందుగా చల్లుకోవడం ద్వారా ఉల్లికోడు మొగిపురుగు తాకిడిని తగ్గించవచ్చు.

స్వల్పకాలిక వరి రకాలు (జగిత్యాల 24423, మారుటేరు 1010, కునారం 118, 1638 మొదలగునవి) నార్లు. ముదిరిన నారుతో నాట్లు వేయొద్దు. తప్పనిసరి పరిస్థితులలో ఇలాంటి నార్లతో నాటు వేసినప్పుడు నత్రజనిలో 2/3వ వంతు అంటే ఒకటిన్నర (1 1/2) బస్తా యూరియా సూచించిన భాస్వరం పొటాష్లను నాటుకు ముందుగా వేసుకోవాలి.

పత్తి చేనులో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వర్షానికి పడిపోయిన మొక్కల్ని నిలబెట్టి చుట్టు మట్టి వేయాలి. వర్షం తగ్గిన సమయంలో ఒక ఎకరానికి పైరిథయోబాక్‌ సోడియం+క్విజలాఫాప్‌ ఈథైల్‌ 500 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి.

సోయాచికుడు : ఇమాజితాఫిర్‌+ప్రొపాక్విజోఫాప్‌ 800 మి.లీ. లేదా ఇమాజితాఫిర్‌+ఫిర్‌ క్విజలాఫాప్‌ ఈథైల్‌ 175 మి.లీ పిచికారీ చేయాలి.
మకజొన్న : సోట్రయాన్‌+అట్రాజిన్‌ 1400 మి.లీ. లేదా టెంబోట్రయాన్‌+అట్రాజిన్‌ 115 మి.లీ.+500గ్రా. పిచికారీ చేయాలి.
కంది/పెసర/మినుము: ఎకరానికి ఇమాజితాఫిర్‌ 300 మిల్లీలీటర్ల చొప్పున స్ప్రే చేయాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు