LK Advani: ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన అద్వానీ!

బీజేపీ సీనియర్ నేత , మాజీ ఉప ప్రధాని ఎల్‌ కే అద్వానీ (96) ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.ఆయన వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.

New Update
LK Advani: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత... అపోలోకి తరలింపు

Lk Advani: బీజేపీ సీనియర్ నేత , మాజీ ఉప ప్రధాని ఎల్‌ కే అద్వానీ (96) ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థతకు గురవ్వడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి ఆయనని తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ వైద్యుల బృందం పర్యవేక్షించింది.

అద్వానీకి మూత్ర సంబంధ వ్యాధుల నిపుణులు, హద్రోగ నిపుణులు, వృద్ధాప్య సంబంధ వ్యాధుల నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఆయన వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో గురువారం సాయంత్రం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

Also read: హైదరాబాద్‌ లో భారీ వర్షం…మరో మూడు రోజులు ఉంటుందన్న ఐఎండీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PM Modi: తన అభిమానికి స్వయంగా చెప్పులు తొడిగిన ప్రధాని మోదీ

ప్రధాన మోదీ హరియాణా పర్యటనలో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. రామ్ పాల్ కశ్యప్ అనే వ్యక్తి ప్రధానే స్వయంగా బూట్లు తొడిగారు. మోదీ ప్రధాని అయి, ఆయనను కలిసినప్పుడే కశ్యప్ చెప్పులు వేసుకుంటానని 14 ఏళ్ళ క్రితం ప్రతిజ్ఞ చేశారు. 

New Update

హరియాణా అభిమాని రామ్ పాల్ కశ్యప్ ను ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు కలిశారు. 14 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అతనిని ఎట్టకేలకు ఇవాళ హరియాణాలో కలసి కాసేపు సస్పెండ్ చేశారు. అంతేకాదు తన కోసం చెప్పులు వేసుకోకుండా ఎదురు చూస్తున్న అతనికి స్వయంగా తన చేత్తోనే బూట్లు కూడా తొడిగారు ప్రధాని. ఆ బూట్లను మోదీనే గిఫ్ట్ గా కూడా ఇవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ప్రేమ చాలు..ఇలాంటి ప్రతిజ్ఞలు వద్దు..

హరియాణాలో జరిగిన యమునా నగర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ తరువాత కైతాల్ కు చెందిన రామ్ పాల్ కశ్యప్ ను ఆయన కలిశారు. మోదీ ప్రధాని అయి,ఆయనను కలిశాకనే చెప్పులు ధరిస్తానని కశ్యప్ 14 ఏళ్ళ క్రితం ప్రమాణం చేశారు. దీని గురించి ప్రధాని మాట్లాడుతూ..ఇలాంటి వ్యక్తుల ప్రేమ , ఆప్యాయతలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. అయితే కశ్యప్ లాంటి ప్రతిజ్ఞలు చేసే ప్రతీ ఒక్కరినీ నేను ఒక్కటే అభ్యర్థిస్తున్నాను. మీ ప్రేమను గౌరవిస్తాను. కానీ ఇలాంటి ప్రతిజ్ఞల కన్నా దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే, నిర్మాణానికి సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టండి అంటూ కోరారు. ఎక్స్ లో కశ్యప్ తో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ఇదంతా రాసారు ప్రధాని మోదీ. దాంతో పాటూగా కశ్యప్ ను ఎందుకలా చేశావ్ అంటూ ప్రేమగా మందలించారు కూడా. నిన్ను నువ్వు ఎందుకు ఇబ్బంది పెట్టుకున్నావ్ అంటూ ఆప్యాయంగా భుజం తట్టారు. 

 today-latest-news-in-telugu | pm modi | fan | shoes

Also Read: వేలంలో ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. దీని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడమే

Advertisment
Advertisment
Advertisment