TDP-JSP : టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు.. ఇన్ని ఇవాల్సిందే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!

టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 20 సీట్లపై ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 32 సీట్లు అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది.

New Update
TDP-JSP :  టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు.. ఇన్ని ఇవాల్సిందే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!

TDP-Janasena : ఏపీ(AP) లో అధికార పార్టీ వైసీపీ(YCP) ని గద్దె దించటమే లక్ష్యంగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను కలిసి ప్రకటించింది లేదు. దీంతో, పలుచోట్ల టీడీపీ జనసేన నేతల మధ్య సీట్ల కోసం వార్ నడుస్తోంది. సీటు తమకంటే తమకంటూ ఇరుపార్టీ నేతలు గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పార్టీ అధినేతలు ఇద్దరు సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..!

ఇన్ని సీట్లు ఇవాల్సిందే.!

20 సీట్లపై ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 32 సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లకు ప్రపోజల్‌ చేసినట్లు సమాచారం. రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని..విజయవాడ వెస్ట్, తెనాలి, దర్శి, పోలవరం సీట్లును జనసేనాని అడుగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : అసెంబ్లీ నుండి టీడీపీ వాకౌట్.!

త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో

అంతేకాకుండా.. కాకినాడ, మచిలీపట్నం లోక్‍సభ సీట్లు జనసేనకే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నిన్నటి చర్చల్లో అనకాపల్లి, తిరుపతి స్థానాల్లో ఒకటి ఇవ్వాలని పవన్ కోరారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో పాలకొల్లు లేదా మరో ప్రాంతంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈనెల ఫిబ్రవరి 8న మరోసారి చంద్రబాబు,  జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సమావేశం కానున్నారని పార్టీ నేతలు అంటున్నారు. ఎదిఏమైనా ఈ నెల14లోపు జనసేనకు ఇచ్చే సీట్లపై బాబు ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారని జనసేన నేతలు భావిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు