Adilabad : దెయ్యం ఉందని విద్యార్థుల వణుకు.. దెబ్బకు భయాన్ని వదిలించిన టీచర్‌!

ఆదిలాబాద్‌ జిల్లా ఆనంద్‌ పూర్‌ పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు భయపడుతున్నారు. ఈ భయాన్ని పొగొట్టేందుకు నూతల రవీందర్‌ అనే ఉపాధ్యాయుడు అమావాస్య రోజు రాత్రి పాఠశాలలో నిద్రించి ఎలాంటి దెయ్యాలు లేవని నిరూపించారు. దీంతో విద్యార్థులు ధైర్యంగా పాఠశాలకు వస్తున్నారు.

New Update
Adilabad : దెయ్యం ఉందని విద్యార్థుల వణుకు.. దెబ్బకు భయాన్ని వదిలించిన టీచర్‌!

Devil Fear : ఆదిలాబాద్‌ జిల్లా (Adilabad District) జైనధ్ మండలం ఆనంద్ పూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులంతా కూడా దెయ్యం ఉందని బెంబేలెత్తిపోతున్నారు. ఇలా గత కొంతకాలంగా జరుగుతుంది. ఇలా జరుగుతుండగానే.. ఆ పాఠశాలకు బదిలీపై నూతల రవీందర్ అనే టీచర్‌ వచ్చారు. ఆయన ఓ రోజు మధ్యాహ్నం పూట విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో పిల్లలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

దీంతో ఆయన గమనించి ఏమైందని వారిని ప్రశ్నించగా.. వారు ఈ పాఠశాలలో దెయ్యం ఉంది సార్ అందుకే మేము భయపడుతున్నామని చెప్పారు. దీంతో విద్యార్థుల భయాన్ని పోగొట్టడం కోసం ఆ ఉపాధ్యాయుడు అమావాస్య రోజు రాత్రి పాఠశాలలోని ఐదో తరగతి గదిలో దెయ్యం (Devil) ఉందని విద్యార్థులు చెప్పడంతో ఆ గదిలోనే ఒంటరిగా పడుకుని విద్యార్థులకు ఉన్న అనుమానాన్ని నివృత్తి చేస్తూ వారిలోని భయాన్ని తొలగించారు.

గతేడాది కేమ శ్రావణ్ అనే నాలుగో తరగతి విద్యార్థి దెయ్యం భయంతో పాఠశాల వదిలి వేరే ప్రైవేట్ పాఠశాల (Private School) లో చేరడం జరిగిందని స్థానికులు ఆయనకు తెలిపారు. ఇలా మళ్లీ ఏ ఇతర విద్యార్థులు కూడా వెళ్లిపోకుండా విద్యార్థుల భయం పోగొట్టేందుకు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆ ఉపాధ్యాయుడు నూతల రవీందర్ అమావాస్య రోజున రాత్రి పాఠశాలలో ఒంటరిగా పడుకొని విద్యార్థులకు ఉన్న దెయ్యం భయాన్ని పోగొట్టారు. దీంతో విద్యార్థుల్లోనూ భయం అనేది పోయింది.

Also read: కోస్తాకు భారీ వర్షసూచన..అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు