Actor Ram and Director Boyapati Combo : రామ్ హీరోగా బోయపాటి యాక్షన్ థ్రిల్లర్

బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నుంచి వస్తున్న మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ స్కంద. ఎనర్జిటిక్ మాస్ హీరో రామ్ తో కలిసి బోయపాటి వర్క్ చేసిన సినిమా ఇది. స్కంద కోసం నమ్మశక్యం కాని విధంగా మేకోవర్ అయ్యాడు రామ్.

New Update
Actor Ram and Director Boyapati Combo : రామ్ హీరోగా బోయపాటి యాక్షన్ థ్రిల్లర్

Actor Ram and Director Boyapati's Action Thriller Skanda: స్కంద చిత్రం  సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరోవైపు సినిమా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడీ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది.సినిమా ప్రీ రిలీజ్ థండర్ వేడుకను ఆగస్ట్ 26న సెలబ్రేట్ చేయబోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో రామ్ (Ram), శ్రీలీల (Sree leela) కెమిస్ట్రీ బాగుంది. రామ్ పంచె కట్టులో కనిపిస్తే, శ్రీలీల చీరలో హోమ్లీగా ఉంది. పొలాల్లో కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందమైన చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తారిద్దరూ.

తమన్ (Thaman) ఈ చిత్రానికి సంగీతం అందించగా, మొదటి రెండు పాటలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. టైటిల్ గ్లింప్స్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రీ-రిలీజ్ థండర్ కూడా పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన గందారబాయి సాంగ్ (Gandarabai Song) పెద్ద హిట్టయింది. రామ్, శ్రీలీల తమ ఎనర్జీతో ప్రేక్షకుల మనసుని కొల్లకొట్టారు.ఎక్స్ టార్డినరీ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. రామ్ డ్యాన్స్‌లో డైనమిజం చూపించగా, శ్రీలీల తన ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ఈ ఇద్దరు గ్రేట్ డ్యాన్సర్లు. నాటు నాటు సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ అందించాడు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా స్కంద విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read: ఓటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు, వీకెండ్ సందడే సందడి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

నేచురల్ స్టార్ నాని హిట్ 3 ట్రైలర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 23.1 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి సినిమాల కంటే ఎక్కువ వ్యూస్ తో అంచనాలను అమాంతం పెంచేస్తోంది.

New Update


బాహుబలి, RRR రికార్డులు బద్దలు 

హిట్ 3 ట్రైలర్ 24 గంటల్లో 23మిలియన్ల వీక్షణాలను సంచలనాత్మక రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి రికార్డులను సైతం బీట్ చేసి.. యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ గా కొనసాగుతోంది.  ఆకర్షణీయమైన కథనం,  మైండ్-బ్లోయింగ్ యాక్షన్ షాట్‌లతో ట్రైలర్  ఆసక్తికరంగా  ఉంది. నాని  స్క్రీన్ ప్రెజెన్స్ భయానకంగా, మునుపెన్నడూ చూడని విధంగా కనిపించింది. భయంకరమైన పోలీస్ అధికారిగా అదరగొట్టారు నాని.  'హిట్3' మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: Indian Film Pyre: ఇమాజిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 'పైర్' చిత్రానికి ఏకంగా 6 విభాగాల్లోనామినేషన్

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోగా.. బోర్డు నుంచి 18+ సర్టిఫికెట్ పొందింది. కొన్ని సన్నివేశాల్లో బూతులు, రక్తపాతం, వాయిలెన్స్ ఉండడం వల్ల 18+ సర్టిఫికెట్ వచ్చింది. పిల్లలు, సున్నితమైన స్వభావం కలవారు ఈ చిత్రానికి దూరంగా ఉండాలి.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన  ఈ మూవీలో శ్రీనిధి శెట్టి కథనాయికగా నటించగా.. రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

telugu-news | latest-news | cinema-news

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment