ACB Raids: రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు!

వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ ఈవో వినోద్‌ రెడ్డి పలు అంతర్గత బదిలీలను నిర్వహించారు. సరుకుల నిలువలలో తేడాలు రాగా గోదాం పర్యవేక్షకుడు నరసయ్యను విధుల నుంచి తప్పించారు.

New Update
ACB Raids: రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు!

ACB Raids: వేములవాడ రాజన్న ఆలయంలో పలు శాఖల్లో ఆలయాధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా ఆలయంలో అంతర్గత బదిలీలను ఆలయ ఈవో వినోద్‌ రెడ్డి నిర్వహించారు. ఈ నేపథ్యంలో 20 మంది ఆలయ అధికారుల అంతర్గత బదిలీలు జరిగినట్లు తెలుస్తుంది.

ప్రధానంగా సరుకుల నిలువలలో తేడాలు రాగా గోదాం పర్యవేక్షకుడు నరసయ్యను విధుల నుంచి తప్పించారు. కళ్యాణ కట్ట లోను భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు, ఒక అటెండర్ ను కూడా బాధ్యతలు నుంచి తొలగించారు.

ముగ్గురు పర్యవేక్షకులతోపాటు 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, 5 రికార్డ్ అసిస్టెంట్లు ఒక అటెండర్ తో కలిపి మొత్తం 20 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఈవో వినోద్ రెడ్డి జారీ చేసారు. ఇంకా ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: జొమాటో కొత్త ఫీచర్‌…రెండు రోజులు ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు!

Advertisment
Advertisment
తాజా కథనాలు