Aadhaar Update: ఆధార్ ఉచిత అప్ డేట్.. గడువును మరో 3 నెలలు పొడిగించిన ఉడాయ్

ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు మార్చి 14 వరకు ఇచ్చిన గడువును మరో మూడు నెలల పాటు ఉడాయ్ పొడిగించింది. జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ మార్పులు చేసుకోవచ్చని వెల్లడించింది.

New Update
Aadhaar Update: ఆధార్ ఉచిత  అప్ డేట్.. గడువును మరో 3 నెలలు  పొడిగించిన ఉడాయ్

Aadhaar Card Update Deadline Extended: ఆధార్ లో(AADHAAR) వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు విధించిన గడువును పొడిగిస్తున్నట్లు ప్రముఖ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) తెలిపింది. ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియనుండగా ఉడాయ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ALSO READ : పాసింజర్ వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయి.. లెక్కలు ఇవే..

ఆధార్ వివారాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన కాలపరిమితి మార్చి 14తో ముగియనుండటంతో  భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ   కీలక నిర్ణయం తీసుకుంది.  మరో మూడు నెలలు గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ లో మార్పులు చేసుకోవచ్చుని పేర్కొంది.

ALSO READ : ఇళ్లపై కూలిన తేజాస్ ఫైటర్ జెట్.. వీడియో వైరల్!

ఆధార్ అప్ డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తొలుత 2023 మార్చి 15 వరకు ఉన్న గడువును డిసెంబర్ 14 వరకు పొడిగించింది. ఆ తర్వాత 2024 మార్చి 14 వరకు అప్ డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది.ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివారాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి లేటేస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు,ఓటర్ ఐడీ,కిసాన్ ఫోటో పాస్ బుక్, పాస్ పోర్ట్ వంటివి గుర్తింపు,చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు.టీసీ,మార్క్ షీట్, పాన్ ఇ ప్యాన్ డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని తెలిపింది. విద్యుత్,నీటి,గ్యాస్,టెలిఫోన్ బిల్లులను మూడు నెలలకు మించని చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు