/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Hyderabad-Murder.jpg)
Hyderabad Murder: హైదరాబాద్ బేగంపేటలోని పాటిగడ్డ ప్రాంతానికి ఉస్మాన్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ వ్యవహారం యువతి బావ అజాజ్‌కు నచ్చలేదు. దాంతో అతను తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్ హత్యకు ప్లాన్ వేశాడు. నలుగురూ మాటువేసి ఉస్మాన్‌ను కత్తులతో పొడిచిచంపారు. దాంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం అజాజ్ తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు యువకులను విచారిస్తున్నారు.