Chandrababu: చంద్రబాబును వెంటాడుతున్న వరుస కేసులు.. తాజాగా మరో కేసు

టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవల్‌ప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కేసు సీఐడీ నమోదుచేసింది. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది.

New Update
Chandrababu: చంద్రబాబును వెంటాడుతున్న వరుస కేసులు.. తాజాగా మరో కేసు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవల్‌ప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కేసు సీఐడీ నమోదుచేసింది. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది. టెర్రా సాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా... కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపణలు చేసింది. అప్పటికే టెర్రా సాఫ్ట్ కంపెనీ బ్లాక్‌ లిస్ట్‌లో ఉందని.. మొత్తం రూ.321 కోట్ల ప్రాజెక్టులో రూ.114. 53 మేర అవినీతి జరిగిందని తేల్చినట్లు సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్-2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. ఏ-1గా వేమూరి హరి ప్రసాద్, ఏ-2గా సాంబశివరావు పేర్లను చేర్చినట్లు తెలిపింది. ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీలను తక్కువ ధరకు అందించే నిమిత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఫైబర్ నెట్ కుంభకోణంలో ఏ-25 నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ సీఐడీ మెమో ధాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో వేసిన పీటీ వారెంట్‌కి అనుబంధంగా ఈ మెమో జతపర్చింది. సంబంధిత శాఖను తన వద్ద ఉన్నప్పుడే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని సీఐడీ ఆరోపించింది. A-1 వేమూరి హరికృష్ణని టెండర్ ప్రాసెస్ కమిటీలో సభ్యుడిగా నియమించేలా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారనే అభియోగం మోపింది. మెస్సర్స్ పేస్ పవర్ అనే సంస్థ ఈ ప్రక్రియను తప్పు పట్టినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొంది. నాసిరకం మెటీరియల్, 80 శాతం ఫైబర్ కేబుల్ పనికి రాకుండా పోయిందని తెలిపింది. ఫేక్ ఇన్‌వాయిస్‌ల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందని వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ డెవల్‌ప్మెంట్‌తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపైనా చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది.

మరోవైపు స్కిల్ డెవల్‌ప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు క్వాష్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. రెండు రోజుల తర్వాత తీర్పును ప్రకటిస్తామని తెలిపింది. ఉదయం నుంచే హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా.. సీనియర్ లాయర్‌ సిద్ధార్థ్‌ అగర్వాల్‌, లండన్‌ నుంచి వర్చువల్‌గా‌ హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు.

అటు చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు స్పందించారు. సున్నితమైన అంశాలపై తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలతో పాటు మతపరమైన అంశాలకు ఇండస్ట్రీ ఎప్పుడూ దూరంగానే ఉంటుందన్నారు. విభజన సమయంలో ఆంధ్ర, తెలంగాణ గొడవలప్పుడూ కూడా చిత్ర పరిశ్రమ స్పందించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మా నాన్న రామానాయుడు, తాను కూడా టీడీపీ తరపున పనిచేశామన్నారు. అది తమ వ్యక్తిగతమైన అంశమని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబే కాదు చాలామంది సీఎంలు కృషి చేశారని సురేష్ బాబు వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Advertisment
Advertisment
తాజా కథనాలు