West Bengal : హౌరాలోని మంగళహాట్లో భారీ అగ్నిప్రమాదం...భయానక వీడియోలు వైరల్..!! పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని మంగళహాట్లో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో పలు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రజలంతా ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. దాదాపు 18 అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. By Bhoomi 21 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి పశ్చిమ బెంగాల్లోని హౌరాలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చాలా భయంకరంగా ఉండటంతో వెంటనే 18 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. మంటలు తీవ్రంగా ఉండడంతో మంగళహాట్ ప్రాంతం మొత్తం కాలి బూడిదైంది. ఈ మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 18 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్న హౌరా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రంజన్ కుమార్ ఘోష్ మాట్లాడుతూ, ప్రస్తుతం 18 ఫైర్ టెండర్ వాహనాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. మంటలు చెలరేగిన మంగళహాట్కి ఎదురుగా హౌరా పోలీస్ స్టేషన్ ఉండటంతో...మంటలను గమనించిన పోలీసులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ముందుగా 12 ఫైర్ ఇంజన్లు ఒక్కొక్కటిగా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దీంతో మొత్తం 18 ఫైర్ టెండర్ వాహనాలు అక్కడికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తొలుత మంటలు చెలరేగినట్లు సమాచారం. అక్కడ చిన్న చిన్న షాపుల్లో పెద్ద మొత్తంలో బట్టలు ఉండడంతో పాటు వెదురు, కలపతో షాపుల నిర్మాణాలు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించిన్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. మంగళహాట్ సమీపంలో అనేక భవనాలు, దుకాణాలకు మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో భయంకరమైన వాతావరణం ఏర్పడింది. ఘటనా స్థలానికి భారీ సంఖ్యలో పోలీసులు, ఆర్ఏఎఫ్లు చేరుకున్నాయి. మంగళహాట్లో అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. హౌరా సిటీ పోలీసుల డిటెక్టివ్లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి