Kotha Prabhakar: కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ట్విస్ట్...!! కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్ కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా ప్రభాకర్ రెడ్డిపై హత్యయత్నం కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రాజుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Bhoomi 31 Oct 2023 in తెలంగాణ మెదక్ New Update షేర్ చేయండి Kotha Prabhakar: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఎంపీపై దాడిచేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. రాజు కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో రాజుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజుపై 307తోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాజు ఏ1గా ఉన్నాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్ అయ్యగారి నర్సింహులు ఘటన జరిగిన సమయంలో రాజుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ఫిర్యాదు చేశాడు. మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపైనా కేసు నమోదు చేసిన దౌల్తాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో యశోద ఆసుపత్రిలో వైద్యులు 4గంటల పాటు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరో నాలుగు రోజులు ఐసీయూలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండనున్నారు. ఇది కూడా చదవండి: బుమ్రాతో పోలికా? సొంత జట్టు ఫ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన పాకిస్థాన్ లెజెండ్! ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ (CM KCR) తోపాటు మంత్రి హరీష్ రావులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాల్సిందే.. గాంధీ భవన్ వద్ద దీక్షకు దిగిన జడ్సన్ #health-bulletin #attack-on-prabhakar-reddy #medak-mp-mp-prabhakar-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి