AP Tourism: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ స్కామ్.. ఏకంగా కోట్లు మింగేశారుగా!

ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో చిక్కుకుంది. కార్పొరేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న దిండి రిసార్ట్స్‌లో రూ.1,16,36,260 అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఈ రిసార్ట్ ఉంది. రిసార్ట్‌ రిసెప్షనిస్ట్ సత్యనారాయణ పరారీలో ఉన్నారు.

New Update
AP Tourism: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ స్కామ్.. ఏకంగా కోట్లు మింగేశారుగా!

AP Tourism Development Corporation: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిండి రిసార్ట్స్ లో భారీ స్కాం జరిగినట్లు తెలుస్తోంది. టూరిజం శాఖ ఉన్నతాధికారులు మలికిపురం పోలీస్ స్టేషన్ లో మేనేజర్ పణింద్ర సహా మరో నాలుగురు ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజోలు సీఐ గోవిందరాజు.

Also Read: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ!

రిసెప్షన్ గా పనిచేస్తున్న సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2021 సంవత్సరం నుంచి దిండి రిసార్ట్స్ కి చెందిన నగదు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 2021 నుంచి దిండి రిసార్ట్స్ కు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా విజిలెన్స్ అధికారులు పరిశీలించి రూ.1,16,36,260 అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు.

Alos Read: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు

దిండి రిసార్ట్స్ మేనేజర్ పణింద్ర, అకౌంటెంట్, ఇద్దరు రిసెప్షలిస్టులు, బార్ నిర్వాహకుడు పాత్రపై సీఐ గోవిందరాజు దర్యాప్తు చేపట్టారు. రిసెప్షనిస్ట్ సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ స్కాంలో అతనే కీలకపాత్ర వహించినట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు