AC in Toilet: ఎంత వేడిగా ఉంటే మాత్రం.. టాయిలెట్లో ఏసీ ఏంట్రా బాబూ.. వైరల్ అవుతున్న ఫోటో! దేశమంతా భానుని ప్రతాపానికి ఉడికిపోతోంది. ఢిల్లీ లోని ఒక వ్యక్తి ఇంటిలో వేడిని తట్టుకోలేక టాయిలెట్ లో కూడా ఏసీ పెట్టించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోను ఒక ఏసీ మెకానిక్ షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్ గా మారింది. ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 01 Jun 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి AC in Toilet: ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వడగాలులకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. నాలుగు రోజుల్లోనే 320 మంది మరణించినట్టు లెక్కలు చెబుతున్నారు. ఎండ వేడి తట్టుకోవడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఢిల్లీలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. దీంతో ఇక్కడ ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇళ్లలో కూడా వేడి భరించలేని స్థాయికి చేరిపోయింది. ఇటు ఎండకి భయపడి బయటకు రాలేక.. అటు ఇంటిలో వేడి.. ఉక్కపోత భరించలేక ఢిల్లీ ప్రజలు అల్లాడుతున్నారు. AC in Toilet: ఇదిలా ఉంటే, ఎండలు పెరగడంతో ఎయిర్ కండిషన్ (ఏసీ) బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిండీఫై. చాలా మంది ఇళ్లలో ఏసీ ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా మీరు ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే, ఢిల్లీలో వేడిని భరించలేక ఒకరు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. @haseenkhan3933 ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వ్యక్తి ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 18న పోస్ట్ చేసిన ఆ ఫొటోకు ఇప్పటివరకూ రెండులక్షల పైగా లైక్స్ వచ్చాయి. దీనిని దాదాపు రెండుకోట్ల మంది చూశారు. ఫోటో చూసినవారంతా కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ చాలా ట్రెండీగా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. ఇంట్లో వేడికి తట్టుకోలేక ఒకరు టాయిలెట్ లో కూడా ఏసీ పెట్టించుకున్నారు. ఆ పోస్ట్ చేసిన వ్యక్తి ఆ ఫొటోకు “ధనవంతుడు అంటే ఇలా ఉండాలి” అని క్యాప్షన్ పెట్టాడు. View this post on Instagram A post shared by Haseen Khan (@haseenkhan3933) AC in Toilet: ఈ ఫోటో ఎక్కడ తీశాడు అనే వివరాలు ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్ చెప్పలేదు. కానీ, ఆ యూజర్ ఒక ఏసీ మెకానిక్ అని అతని ప్రొఫైల్ చూస్తే అర్ధం అవుతుంది. ఏసీ రిపేరుకు సంబంధించి ఆటను చాలా అప్ డేట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఎక్కడో ఏసీ రిపేరుకు వెళ్ళినపుడు ఈ ఫోటో తీసినట్టు ఉంది. మొత్తం మీద టాయిలెట్ లో ఏసీ పెట్టుకున్న ఆ మహానుభావుడికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంటుతున్నారు. #air-conditioner #toilet సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి