Vemulawada: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

TG: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్‌ దర్శనం అందుబాటులోకి తేనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రతిపాదనలు దేవాదాయ శాఖకు పంపినట్లు చెప్పారు. శ్రావణ మాసం మొదటి వారంలోనే బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు అధికారులు.

New Update
Vemulawada: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

Vemulawada: వేములవాడకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్‌ దర్శనం అందుబాటులోకి తేనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రతిపాదనలు దేవాదాయ శాఖకు పంపినట్లు చెప్పారు. శ్రావణ మాసం మొదటి వారంలోనే బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు అధికారులు. ఇప్పటికే యాదాద్రి ఆలయంలో బ్రేక్‌ దర్శనాలను ఆలయ అధికారులు పరిశీలించారు. వేములవాడలో ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.

బ్రేక్‌ దర్శనం టికెట్‌ ధరను రూ.300గా నిర్ణయించినట్లు వెల్లడించారు. పదేళ్ల లోపు చిన్నారులకు టికెట్‌ తీసుకునే అవసరం లేదని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం 10.15 నుంచి 11.15 గంటల వరకు ఒకసారి, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మరోసారి బ్రేక్‌ దర్శనానికి అనుమతించనున్నారు. ఈ టికెట్‌ తీసుకున్న భక్తులకు వంద గ్రాముల లడ్డూను ఉచితంగా ఇవ్వనున్నారు. బ్రేక్‌ దర్శనం టికెట్లను ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఆలయ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు