గొర్రెల మంద పైకెళ్లిన 9 ఫీట్ల మొసలి..వెంటనే కాపరి ఏం చేశాడంటే..! 9 ఫీట్ల పొడువున్న మొసలి..గొర్రెల మందను టార్గెట్ చేసి ఎటాక్ కు దిగింది. మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకున్న ఈ సంఘటన మక్తల్ మండలంలోని కాట్రపల్లిలో కలకలం రేపింది. వెంటనే గొర్రెల కాపరి అలర్ట్ అయి గ్రామస్తులకు సమాచారం తెలపడంతో గొర్రెలు సేఫ్ కాగా.. మొసలి మాత్రం బంధీ అయింది. By P. Sonika Chandra 08 Aug 2023 in క్రైం మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి 9 ఫీట్ల పొడువున్న మొసలి..గొర్రెల మందను టార్గెట్ చేసి ఎటాక్ కు దిగింది. మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకున్న ఈ సంఘటన మక్తల్ మండలంలోని కాట్రపల్లిలో కలకలం రేపింది. వెంటనే గొర్రెల కాపరి అలర్ట్ అయి గ్రామస్తులకు సమాచారం తెలపడంతో గొర్రెలు సేఫ్ కాగా.. మొసలి మాత్రం బంధీ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..కాట్రపల్లి గ్రామంలో ఉండే పరంధాములు అనే వ్యక్తి తన గొర్రెల మందను తెల్లవారు జామున రెండు గంటలకు మేత కోసం పొలంలోకి తీసుకెళ్ళాడు. ఇంతలో ఓ పెద్ద మొసలి ఆ గొర్రెల మందపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే గొర్రెల మందకు కాపలాగా ఉన్న కుక్కలు ఒక్కసారిగా పెద్దపెద్దగా ఆరవడం మొదలుపెట్టాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన కాపరి పరంధాములు గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. గ్రామస్తులు చేతిలో కట్టెలు పట్టుకొని స్పాట్ కు చేరుకున్నారు. మొసలిని తాళ్లతో బంధించి చెట్టుకు కట్టేశారు. తరువాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే భూత్పూర్ రిజర్వాయర్ పరిసరాల్లో పొలం ఉండడంతో మొసలి అక్కడికి వచ్చినట్టు గ్రామస్తులు చెబుతున్నారు #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి