/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
-
Dec 20, 2024 09:24 IST
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. మరికొద్ది సేపట్లో కేటీఆర్ అరెస్ట్?
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నేడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు తెలంగాణ భవన్ వద్ద మోహరిస్తున్నారు. మరో వైపు ఈ కేసు విషయంలో నేడు కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
-
Dec 20, 2024 07:50 IST
తెలంగాణలో భారీ వర్షాలు..వాతావరణశాఖ కీలక ప్రకటన
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు వచ్చాయని.. చలి తీవ్రత తగ్గిందని అధికారులు చెప్పారు.
-
Dec 20, 2024 07:48 IST
సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ తీవ్ర విమర్శలు పాలవుతోంది. ఓ కన్సల్టింగ్ కంపెనీ షేర్ చేసిన ఈ నోటిఫికేషన్‌లో జాబ్ కు అప్లయ్ చేయమని ఆహ్వానించారు కానీ సౌత్ ఇండియన్స్ అవకూడదని కండిషన్ పెట్టారు. దీని మీదే నెటిజన్లు మండిపడుతున్నారిప్పుడు.
-
Dec 20, 2024 07:48 IST
ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!
ఏపీకి మరో కొత్త వందేభారత్ రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. విశాఖపట్నం నుంచి తిరుపతికి కొత్త వందేభారత్ స్లీపర్ సర్వీస్‌పై ప్రతిపాదన వచ్చింది. ఈ మేరకు లోక్‌సభలో ఏపీకి చెందిన ఎంపీ ఈ విషయం గురించి కేంద్రాన్ని కోరారు.