Tollywood Bonanza: బాక్సాఫీసు వార్, ఈ వారంలో 8 కొత్త సినిమాలు

గత వారం రిలీజైన మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్, పిజ్జా-3 లాంటి సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. నిలదొక్కుకుంటుందని భావించిన మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా నిరాశపరిచింది. దీంతో ఈవారం థియేటర్లలోకి 8 సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో ఆల్రెడీ ఓ సినిమా థియేటర్లలోకి వచ్చింది.

New Update
Tollywood Bonanza: బాక్సాఫీసు వార్, ఈ  వారంలో 8  కొత్త  సినిమాలు

8 Telugu Films Releasing this Week: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా కింగ్ ఆఫ్ కొత్త (King of Kotha) గురువారమే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా. దుల్కర్ కెరీర్ లో పూర్తిస్థాయి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ మూవీ కోసం భారీగా ప్రచారం చేశాడు దుల్కర్. ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు ఈ హీరో.

ఇక శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న సినిమా గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). ప్రవీణ్ సత్తారు డైరక్ట్ చేసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ (Varun Tej)హీరోగా నటించాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఓ కీలక పాత్రలో నాజర్ కనిపించనున్నాడు. సమాజం పెద్దగా పట్టించుకోని ఓ సమస్యను ఇందులో చర్చించామని చెబుతున్నాడు వరుణ్ తేజ్. సినిమా మొత్తం పూర్తిస్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని చెబుతున్నాడు.

గాండీవధారి అర్జునకు పోటీగా వస్తోంది బెదురులంక 2012 (Bedurulanka 2012). కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడు.ఇందులో కార్తికేయ సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదల అయిన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో చిత్రీకరించిన సినిమా ఇది.

వీటితో పాటు రెజీనా లీడ్ రోల్ పోషించిన సినిమా నేనేనా (NeneNaa) కూడా థియేటర్లలోకి వస్తోంది. ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో "సూర్పనగై" అనే సినిమా చేసింది రెజీనా. కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్ , జై ప్రకాష్ వంటి కీలక నటులు నటించారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందించాడు. ఈ సినిమా తెలుగులో నేనేనా పేరుతో రిలీజ్ అవుతోంది. వెన్నెల కిషోర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు.

ఈ సినిమాలతో పాటు... దక్ష, రెంట్, ఏం చేస్తున్నావ్, బాయ్స్ హాస్టల్ (Boys Hostel) లాంటి సినిమాలు కూడా శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో, బాక్సాఫీస్ కు ఏ సినిమా కళ తీసుకొస్తుందో చూడాలి.

Also Read: ఢిల్లీలో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రకటన.. రేసులో RRR, పుష్ప

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment